త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | వరుస లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. రెండు నెలల గరిష్టానికి సూచీలు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం వరుసగా ఐదో సెషన్‌లోనూ లాభాలను నమోదు చేశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు, అమెరికా స్టాక్ ఫ్యూచర్స్‌లో భారీ రికవరీ, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు నెలల గరిష్ట‌ స్థాయిలను తాకాయి. ఏఐ, డేటా సెంటర్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ పరికరాల రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ ర్యాలీకి మరింత బలాన్నిచ్చాయి.

S

Business | Published On Nov 4, 2026, 4.05 pm IST

Stock Markets | వరుస లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. రెండు నెలల గరిష్టానికి సూచీలు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం వరుసగా ఐదో సెషన్‌లోనూ లాభాలను నమోదు చేశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు, అమెరికా స్టాక్ ఫ్యూచర్స్‌లో భారీ రికవరీ, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు నెలల గరిష్ట‌ స్థాయిలను తాకాయి. ఏఐ, డేటా సెంటర్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ పరికరాల రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ ర్యాలీకి మరింత బలాన్నిచ్చాయి.

రెండు నెల‌ల గ‌రిష్టానికి సూచీలు..

భారత ఈక్విటీ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముందుకు సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 383.55 పాయింట్లు (0.50 శాతం) పెరిగి 77,301.40 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 149.75 పాయింట్లు (0.63 శాతం) లాభపడి 23,960.60 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో రెండు సూచీలు రెండు నెలల గరిష్ఠ స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ గతంలో ఆగస్టు 27న 77,694.97 వద్ద, నిఫ్టీ సెప్టెంబర్ 4న 23,895.85 వద్ద రెండు నెలల గరిష్టాన్ని నమోదు చేశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు, భారీ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నిలిచాయి.

అత్య‌ధికంగా లాభ‌ప‌డ్డ మీడియా షేర్లు..

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మీడియా సూచీ అత్యధికంగా 5.15 శాతం లాభపడింది. రియాల్టీ సూచీ 2.85 శాతం, మెటల్ సూచీ 2.80 శాతం పెరిగాయి. ఎఫ్ఎంసీజీ సూచీ 1.50 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 1.54 శాతం లాభపడ్డాయి. అయితే ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టీ ఐటీ సూచీ 1.50 శాతం నష్టపోయింది. నిఫ్టీ బ్యాంక్ 0.67 శాతం పెరిగి 55,913.60 వద్దకు చేరగా, ప్రైవేట్ బ్యాంక్ సూచీ 0.29 శాతం లాభపడింది. జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీ మాట్లాడుతూ విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. డౌ జోన్స్, నాస్‌డాక్ ఫ్యూచర్స్‌లో భారీ రికవరీ, ట్రంప్ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతావరణం కూడా ప్రభావం చూపాయని పేర్కొన్నారు. ఏఐ, డేటా సెంటర్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ పరికరాల షేర్లలో కొనుగోళ్లు పెరిగాయని, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు వరుసగా రెండో సెషన్‌లోనూ బలంగా కొనసాగాయని వివరించారు. ఐటీ షేర్లలో మాత్రం అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోందన్నారు.

మార్కెట్ కీలక స్థాయిల విషయానికి వస్తే నిఫ్టీకి 23,700-23,800 స్థాయిల వద్ద బలమైన మద్దతు ఉందని అనిల్ సింఘ్వీ అంచనా వేశారు. బ్యాంక్ నిఫ్టీకి 55,300-55,500 స్థాయిలు కీలక మద్దతుగా ఉంటాయని తెలిపారు. పైవైపు నిఫ్టీకి 24,000-24,150 స్థాయిలు, బ్యాంక్ నిఫ్టీకి 55,900-56,200 స్థాయిలు కీలక నిరోధక స్థాయిలుగా పేర్కొన్నారు. నిఫ్టీ 23,800 పైన, బ్యాంక్ నిఫ్టీ 55,850 పైన ముగిస్తే మార్కెట్‌లో మరింత పైకి వెళ్లే అవకాశాలు బలపడతాయని విశ్లేషించారు.

ట్యాగ్స్:

Indian Stock MarketNifty 50SensexStock Market RallyStock Markets
Advertisement
Advertisement