Minister Pongulet Srinivas Reddy | ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు
Minister Pongulet Srinivas Reddy | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ దీపావళి రోజున ప్రతి ఇందిరమ్మ ఇంట్లో వేడుకలు నిర్వహించాలని లబ్ధిదారులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు పిలుపునిచ్చారు. పే
- లబ్ధిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలి
- రాష్ట్రవ్యాప్తంగా 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తి
- మరో 1.90 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నయ్
- నాలుగు కార్పొరేషన్లలో హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ టవర్స్
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Minister Pongulet Srinivas Reddy | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ దీపావళి రోజున ప్రతి ఇందిరమ్మ ఇంట్లో వేడుకలు నిర్వహించాలని లబ్ధిదారులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు పిలుపునిచ్చారు. పేదల ఇళ్లలో వెలిగే ప్రతి దీపం తెలంగాణ ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ప్రతీక కావాలని ఆకాంక్షించారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి పొంగులేటి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఎన్ని ఆర్థిక అవరోధాలున్నా పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు.
ఆనందంలో భాగస్వాములు కావాలి..
తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా.. ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని, మరో 1.90 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వివరించారు. గృహప్రవేశాలు పూర్తయిన ఇళ్లలో దీపావళి రోజున ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, ఈ పథకంతో సంబంధం ఉన్న వారంతా పాల్గొని లబ్ధిదారుల ఆనందంలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమానికి సూచికగా రూపొందించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు’ పోస్టర్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రివర్గం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటోందని తెలిపారు.
నాలుగు కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్
తొలి విడతలో 4.50 లక్షలు, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లతోపాటు హైదరాబాద్ కోర్ ఏరియా పరిధిలో లక్ష ఇళ్లను మంజూరు చేసినట్లు పొంగులేటి తెలిపారు. హైదరాబాద్ తరహాలోనే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని ప్రకటించారు. జి+5 విధానంలో నిర్మించనున్న ఈ టవర్స్‌కు సంబంధించి దీపావళిలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ నుంచి వచ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామని పునరుద్ఘాటించారు.
రూ.40వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం
రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రతి సోమవారం హైదరాబాద్ నుంచి నేరుగా, అవినీతికి తావులేకుండా నిధులు జమ చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలతోపాటు మారుమూల ప్రాంతాలు, తండాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. ఈ పథకం ద్వారా పేదల సొంతింటి కల సాకారమవుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Stock Markets | వరుస లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. రెండు నెలల గరిష్టానికి సూచీలు..
- ●Ravi Basrur | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కి మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బస్రూర్
- ●Iran | భారత్‌కు భారీ ఊరట.. హార్ముజ్ జలసంధిలో నౌకలకు గ్రీన్ సిగ్నల్..
- ●Sandeep Reddy Vanga | సినిమాలపై నిందలు సరికాదు
- ●Telangana Student Suicide Jabalpur | మధ్యప్రదేశ్‌లో తెలంగాణ యువతి ఆత్మహత్య.. కారణం అదేనా?
- ●MLC Dasoju Sravan | జీవో నెం 14ను తక్షణమే రద్దు చేయాలి

Stock Markets | వరుస లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. రెండు నెలల గరిష్టానికి సూచీలు..

Ravi Basrur | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కి మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బస్రూర్

Iran | భారత్‌కు భారీ ఊరట.. హార్ముజ్ జలసంధిలో నౌకలకు గ్రీన్ సిగ్నల్..

Sandeep Reddy Vanga | సినిమాలపై నిందలు సరికాదు






