Bangladesh | బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం.. 20 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న పార్టీ
Bangladesh | దాదాపు రెండేళ్ల నుంచి తీవ్ర రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోన్న బంగ్లాదేశ్ (Bangladesh)లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్లుగా అధికారం కోసం ఎదురు చూస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party) ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.
International | Published On Feb 13, 2026, 10.57 am IST
Bangladesh | దాదాపు రెండేళ్ల నుంచి తీవ్ర రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోన్న బంగ్లాదేశ్ (Bangladesh)లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్లుగా అధికారం కోసం ఎదురు చూస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party) ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నిన్న జరిగిన 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ (Tarique Rahman) నేతృత్వంలోని బీఎన్‌పీ భారీ మెజారిటీతో గెలుపొందింది.
మొత్తం 299 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి బీఎన్‌పీ (BNP) 212 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపుతో రెహమాన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు బీఎన్‌పీ ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో జమాతే ఏ ఇస్లామీ నేతృత్వంలోని కూటమి 70 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే, అధికార ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్క్‌ను బీఎన్‌పీ దాటేసింది. ఆ పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ ఢాకా-17, బోగ్రా-6 స్థానాల నుంచి ఘన విజయం సాధించారు.
17 ఏళ్ల అజ్ఞాతం వీడి..
తారక్ రెహమాన్.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు. సుమారు 17 ఏళ్లపాటు లండన్ నుంచి పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించారు. ఖలీదా జియా అనారోగ్యంతో ఉండటంతో.. 17 ఏళ్ల స్వీయ అజ్ఞాతవాసాన్ని వీడి గతేడాది డిసెంబర్‌లో ఢాకాలో అడుగుపెట్టారు. ఇక అదే నెల 30న ఆయన తల్లి ఖలీదా జియా కన్నుమూసిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు

Bangladesh | సరిహద్దుల్లో ముళ్లకంచెలకు భయపడం.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్
మే 12, 2026

Indian High Commissioner | బంగ్లాదేశ్‌లో భారత రాయబారిగా బెంగాల్ బీజేపీ నేత!
ఏప్రిల్ 20, 2026

Hasina’s Extradition Case | షేక్ హసీనా అప్పగింతపై విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు..!
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



