Bangladesh Elections | బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు.. రేపు ఉదయానికి ఫలితాలు
Bangladesh Elections | తీవ్ర రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (Bangladesh Elections) జరుగుతున్నాయి. గురువారం ఉదయం 7.30 గంటలకు 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
International | Published On Feb 12, 2026, 9.18 am IST
Bangladesh Elections | త్రినేత్ర.న్యూస్: తీవ్ర రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (Bangladesh Elections) జరుగుతున్నాయి. గురువారం ఉదయం 7.30 గంటలకు 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 300 పార్లమెంటు స్థానాలకుగాను 299 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1981 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 51 పార్టీలు ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. అయినప్పటికీ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (BNP), షఫీకుర్ రెహమాన్ నేతృత్వంలోని జమాత్-ఎ-ఇస్లామీ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) జమాత్ ఇస్లామీ కూటమిలో చేరింది.
హసీనా లేకుండా..
2024లో విద్యార్థుల భారీ ఉద్యమంతో మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) నేతృత్వంలోని అవామీ లీగ్ (Awami League) ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతున్నది. తాజా ఎన్నికలతో తాత్కాలిక ప్రభుత్వానికి తెరపడనుంది. కాగా, షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ లేకుండా బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. ఆ పార్టీపై తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.
శుక్రవారం ఉదయానికి ఫలితాలు
కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 4.30 గంటలకు ముగియనుంది. వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఫలితాలు అర్ధరాత్రి తర్వాత వెలువడే అవకాశం ఉంది. అయితే శుక్రవారం ఉదయం ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
యువ ఓటర్లే కీలకం..
ఈ ఎన్నికల్లో దాదాపు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో సగానికి పైగా యువతే ఉండటం గమనార్హం. వారిలో దాదాపు 45 లక్షల మంది తొలిసారి ఓటు వేయబోతున్నారు. అందువల్ల యువత తీసుకునే నిర్ణయంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
https://x.com/ANI/status/2021759105892041200
సంబంధిత వార్తలు

Bangladesh | సరిహద్దుల్లో ముళ్లకంచెలకు భయపడం.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్
మే 12, 2026

Indian High Commissioner | బంగ్లాదేశ్‌లో భారత రాయబారిగా బెంగాల్ బీజేపీ నేత!
ఏప్రిల్ 20, 2026

Hasina’s Extradition Case | షేక్ హసీనా అప్పగింతపై విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు..!
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



