Motilal Oswal | టెక్స్‌టైల్ షేర్లపై మోతీలాల్ ఒస్వాల్ బుల్ సెంటిమెంట్.. ఈ 5 స్టాక్స్‌కు బై రేటింగ్..
Motilal Oswal | ప్రపంచ టెక్స్‌టైల్ రంగం మళ్లీ పుంజుకునే దశలోకి అడుగుపెడుతోందని, ఈ నేపథ్యంలో ఎగుమతులపై ఆధారపడిన టెక్స్‌టైల్ కంపెనీలు, హోమ్ టెక్స్‌టైల్ తయారీ సంస్థలకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఒస్వాల్ పేర్కొంది.
Motilal Oswal | ప్రపంచ టెక్స్‌టైల్ రంగం మళ్లీ పుంజుకునే దశలోకి అడుగుపెడుతోందని, ఈ నేపథ్యంలో ఎగుమతులపై ఆధారపడిన టెక్స్‌టైల్ కంపెనీలు, హోమ్ టెక్స్‌టైల్ తయారీ సంస్థలకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఒస్వాల్ పేర్కొంది. డిమాండ్ పునరుద్ధరణ, సుంకాల పరంగా మెరుగైన పోటీ సామర్థ్యం, కొనసాగుతున్న సామర్థ్య విస్తరణ కారణంగా ఈ రంగం తిరిగి వృద్ధి బాట పట్టే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎనిమిది టెక్స్‌టైల్ కంపెనీలపై కవరేజ్ ప్రారంభించిన సంస్థ, అందులో ఐదు కంపెనీలకు బై (Buy) రేటింగ్ ఇచ్చింది. కోవిడ్ తర్వాత వచ్చిన భారీ డిమాండ్ పెరుగుదల అనంతరం 2021 నుంచి 2025 వరకు ప్రపంచ టెక్స్‌టైల్, అప్పారెల్ రంగం ఒత్తిడిని ఎదుర్కొంది. వినియోగదారుల ఐచ్ఛిక ఖర్చులు తగ్గడం, రిటైలర్ల వద్ద అధిక నిల్వలు, సప్లై చెయిన్ అంతరాయాలు, సుంకాల అనిశ్చితి తదితర అంశాలు వృద్ధిని దెబ్బతీశాయి. అయితే ఇప్పుడు నిల్వలు సాధారణ స్థాయికి చేరుకోవడం, ద్రవ్యోల్బణం తగ్గడం, సోర్సింగ్ ధోరణులు స్థిరపడటంతో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని పేర్కొంది.
సానుకూలంగా మారుతున్న పరిస్థితులు..
భారత్‌కు యూకే, యూరోపియన్ యూనియన్‌తో కుదురుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, అమెరికా మార్కెట్‌లో తగ్గుతున్న సుంకాల ప్రతికూలత, చైనా నుంచి ఇతర దేశాలకు సోర్సింగ్ మారుతున్న ధోరణి వల్ల భారత టెక్స్‌టైల్ రంగానికి భారీ అవకాశాలు ఉన్నాయని మోతీలాల్ ఒస్వాల్ అభిప్రాయపడింది. అలాగే గార్మెంట్స్, ఫ్యాబ్రిక్స్, టెక్నికల్ టెక్స్‌టైల్స్, విలువ ఆధారిత ఉత్పత్తుల విభాగాల్లో భారత కంపెనీలు కొత్త క్యాపెక్స్ దశలోకి ప్రవేశిస్తున్నాయని తెలిపింది. పీఎం మిత్ర, పీఎల్‌ఐ, ఏటీయూఎఫ్‌ఎస్ వంటి ప్రభుత్వ పథకాల మద్దతుతో విస్తరణ వేగవంతం అవుతుందని పేర్కొంది. అంతర్జాతీయ బ్రాండ్లు భారీ స్థాయి, నిబంధనలకు అనుగుణంగా పనిచేసే సంస్థలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడంతో పెద్ద లిస్టెడ్ ఎగుమతి సంస్థలకు లాభం కలిగే అవకాశం ఉందని తెలిపింది.
గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్, అరవింద్..
మోతీలాల్ ఒస్వాల్ సంస్థ గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్ కు బై రేటింగ్ ఇస్తూ రూ.1,110 లక్ష్య ధర నిర్ణయించింది. ఇది రిపోర్ట్‌లో తీసుకున్న సూచన ధరతో పోలిస్తే సుమారు 36 శాతం పెరుగుదల అవకాశాన్ని సూచిస్తోంది. భారత్‌లో సామర్థ్య విస్తరణ, ఆఫ్రికా వ్యాపారంలో మెరుగైన వినియోగం, ఆఫ్రికన్ గ్రోత్ అండ్ అపార్చునిటీ యాక్ట్ (ఏజీఓఏ) పునరుద్ధరణ కారణంగా కంపెనీ బలమైన వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2026-28 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆదాయం 18 శాతం సీఏజీఆర్, ఈబిట్డా 33 శాతం సీఏజీఆర్, సర్దుబాటు చేసిన నికర లాభం 73 శాతం సీఏజీఆర్ నమోదు చేస్తుందని అంచనా వేసింది. అలాగే అరవింద్ షేరుకు కూడా సంస్థ బై రేటింగ్ ఇస్తూ రూ.670 లక్ష్య ధరను నిర్ణయించింది. ప్రస్తుతం ఫ్యాబ్రిక్ ఆధారిత సంస్థ నుంచి గార్మెంట్స్ కేంద్రంగా మారుతున్నందున కంపెనీకి ఎక్కువ మార్కెట్ అవకాశాలు లభిస్తాయని తెలిపింది. అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ విభాగం, డాల్కో-జీఎఫ్‌టీ కొనుగోలు కూడా లాభదాయకతను పెంచుతాయని పేర్కొంది. 2026-28 మధ్య ఆదాయం 15 శాతం, ఈబిట్డా 23 శాతం, సర్దుబాటు చేసిన నికర లాభం 29 శాతం సీఏజీఆర్ నమోదవుతుందని అంచనా వేసింది.

పెర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్..
పెర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ కి కూడా మోతీలాల్ ఓస్వాల్ బై రేటింగ్ ఇస్తూ రూ.2,300 లక్ష్య ధర నిర్ణయించింది. భారత్, బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేషియాలో సామర్థ్య విస్తరణ కారణంగా ఆదాయం బలంగా పెరుగుతుందని తెలిపింది. 2026-28 మధ్య ఆదాయం 14 శాతం, ఈబిట్డా 25 శాతం, సర్దుబాటు చేసిన నికర లాభం 29 శాతం సీఏజీఆర్ నమోదు చేస్తుందని అంచనా వేసింది. అలాగే ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ కి రూ.550 లక్ష్య ధరతో బై రేటింగ్ ఇచ్చింది. ఇది ఈ రంగంలో అత్యధికంగా 39 శాతం అప్‌సైడ్ అవకాశాన్ని సూచిస్తోందని తెలిపింది. బెడ్ లినెన్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న ఈ కంపెనీ, యుటిలిటీ బెడ్డింగ్ వ్యాపారం, దేశీయ బెడ్ లినెన్ కార్యకలాపాల ద్వారా మరింత వేగంగా వృద్ధి సాధించే అవకాశం ఉందని పేర్కొంది. 2026-28 మధ్య ఆదాయం 20 శాతం, ఈబిట్డా 44 శాతం, సర్దుబాటు చేసిన నికర లాభం 90 శాతం సీఏజీఆర్ నమోదవుతుందని అంచనా వేసింది.
వెల్‌స్పన్ లివింగ్..
వెల్‌స్పన్ లివింగ్ కి మోతీలాల్ సంస్థ రూ.200 లక్ష్య ధరతో బై రేటింగ్ ఇచ్చింది. దేశంలోని ప్రముఖ హోమ్ టెక్స్‌టైల్ ఎగుమతి సంస్థల్లో ఒకటైన ఈ కంపెనీ, తక్కువ సుంకాలు, యూకే, యూరోపియన్ యూనియన్‌తో సంభావ్య వాణిజ్య ఒప్పందాల ప్రయోజనంతో మధ్యస్థాయి రెవెన్యూ వృద్ధిని సాధిస్తుందని తెలిపింది. 2026-28 మధ్య ఆదాయం 14 శాతం, ఈబిట్డా 43 శాతం, సర్దుబాటు చేసిన నికర లాభం 97 శాతం సీఏజీఆర్ నమోదవుతుందని అంచనా వేసింది. టెక్స్‌టైల్ రంగంపై ఆశావహ దృక్పథానికి కారణాలను కూడా మోతీలాల్ ఒస్వాల్ వివరించింది. అమెరికా రిటైల్ రంగంలోని నిల్వలు 2-3 సంవత్సరాల తర్వాత కోవిడ్‌కు ముందు స్థాయికి చేరుకోవడం వల్ల ఆర్డర్లలో అస్థిరత తగ్గి, భారత ఎగుమతిదారులకు సాధారణ వ్యాపార సైకిల్ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపింది. అంతర్జాతీయ రిటైలర్ల నుంచి డిమాండ్, నిల్వలపై వస్తున్న సానుకూల వ్యాఖ్యలు కూడా ఈ అభిప్రాయానికి బలం కలిగిస్తున్నాయని పేర్కొంది.
భారీగా తగ్గిన సుంకాలు..
అమెరికా మార్కెట్‌లో భారత టెక్స్‌టైల్ ఉత్పత్తులపై ఉన్న సుంకాల భారం కూడా తగ్గిందని తెలిపింది. 2025లో భారత ఎగుమతులపై అదనపు సుంకాలు 50 శాతం వరకు పెరిగినా, 2026 నాటికి అవి సుమారు 10 శాతానికి తగ్గాయని పేర్కొంది. మరోవైపు బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేషియా వంటి పోటీ దేశాలు ఇంకా సుమారు 19-20 శాతం సుంకాలను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. భారత్ టెక్స్‌టైల్, అప్పారెల్ మార్కెట్ 2026 ఆర్థిక సంవత్సరంలో సుమారు 194 బిలియన్ డాలర్లకు చేరగా, ఎగుమతులు 37 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని మోతీలాల్ ఒస్వాల్ పేర్కొంది. ప్రపంచ బ్రాండ్లు చైనా నుంచి సోర్సింగ్‌ను విభిన్న దేశాలకు విస్తరిస్తుండటంతో, పెద్ద స్థాయి ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యత ప్రమాణాలు, విస్తృత ఉత్పత్తుల శ్రేణి కారణంగా భారత్‌కు మరింత మార్కెట్ వాటా లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
ప్రపంచ డిమాండ్ పునరుద్ధరణ, అనుకూల సుంకాల పరిస్థితి, కొనసాగుతున్న పెట్టుబడులు, ప్రభుత్వ మద్దతు కారణంగా భారత టెక్స్‌టైల్ రంగం కొత్త వృద్ధి దశలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని మోతీలాల్ ఒస్వాల్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్, అరవింద్, పెర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, వెల్‌స్పన్ లివింగ్ షేర్లను కొనుగోలు చేయాలని పెట్టుబడిదారులకు సిఫారసు చేసింది.
తాజావార్తలు
- ●Venezuela Earthquakes | వరుస భూకంపాలతో వెనెజువెలాలో 32 మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- ●Anand Mahindra | వృద్ధ కళాకారుడికి అండగా నిలిచి.. ఔదార్యత చాటుకున్న ఆనంద్ మహీంద్రా
- ●Maharashtra FDA | పేపర్లో ఆహారం ఇస్తే కఠిన చర్యలు.. మహారాష్ట్రలో కొత్త ఫుడ్ సేఫ్టీ నిబంధనలు..
- ●Revanth Reddy | 28న నల్లగొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ●Rajya Sabha MPs | 31 శాతం మంది రాజ్యసభ ఎంపీలపై క్రిమినల్ కేసులు.. రూ..5,300 కోట్ల ఆస్తితో తెలంగాణ ఎంపీ టాప్
- ●SBI | ఎస్బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. స్థానిక భాష తెలిసినవారికి ప్రాధాన్యం

Venezuela Earthquakes | వరుస భూకంపాలతో వెనెజువెలాలో 32 మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Anand Mahindra | వృద్ధ కళాకారుడికి అండగా నిలిచి.. ఔదార్యత చాటుకున్న ఆనంద్ మహీంద్రా

Maharashtra FDA | పేపర్లో ఆహారం ఇస్తే కఠిన చర్యలు.. మహారాష్ట్రలో కొత్త ఫుడ్ సేఫ్టీ నిబంధనలు..

Revanth Reddy | 28న నల్లగొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన



