త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajya Sabha MPs | 31 శాతం మంది రాజ్య‌స‌భ ఎంపీల‌పై క్రిమిన‌ల్ కేసులు.. రూ..5,300 కోట్ల ఆస్తితో తెలంగాణ‌ ఎంపీ టాప్

Rajya Sabha MPs | రాజ్యసభ సభ్యుల (Rajya Sabha MPs) ఆర్థిక, నేర చరిత్రపై (criminal cases) అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR Report) సంచ‌ల‌న నివేదిక వెలువ‌రించింది.

D

National | Published On Jun 25, 2026, 12.37 pm IST

Rajya Sabha MPs | 31 శాతం మంది రాజ్య‌స‌భ ఎంపీల‌పై క్రిమిన‌ల్ కేసులు.. రూ..5,300 కోట్ల ఆస్తితో తెలంగాణ‌ ఎంపీ టాప్
Advertisement

Rajya Sabha MPs | రాజ్యసభ సభ్యుల (Rajya Sabha MPs) ఆర్థిక, నేర చరిత్రపై (criminal cases) అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR Report) సంచ‌ల‌న నివేదిక వెలువ‌రించింది. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఉన్న 226 మందిలో 31 శాతం మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్నట్లు తెలిపింది. వీరిలో 16 శాతం మంది తీవ్ర‌మైన క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొంటున్న‌ట్లు ఏడీఆర్ నివేదిక వెల్ల‌డించింది.

మొత్తం 233 మంది రాజ్య‌స‌భ స‌భ్యుల్లో 226 మంది సమర్పించిన అఫిడవిట్లను విశ్లేసించి ఏడీఆర్ నివేదిక విడుద‌ల చేసింది. ఆ నివేదిక ప్ర‌కారం.. 226 మంది ఎంపీల్లో 69 మంది (31%) త‌మ‌పై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. అందులో 36 మంది అంటే 16 శాతం తీవ్ర‌మైన క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఒక ఎంపీపై హత్య కేసు, నలుగురిపై హత్యాప్రయత్నం కేసులు ఉన్నాయి. ఇంకో నలుగురు ఎంపీలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.

పార్టీల వారీగా చూస్తే.. అధికార బీజేపీకి చెందిన 107 మంది రాజ్య‌స‌భ ఎంపీల్లో 28 మంది, కాంగ్రెస్‌కు చెందిన 29 మంది ఎంపీల్లో 12 మంది, తృణ‌మూల్ కాంగ్రెస్‌కు చెందిన తొమ్మిది మంది ఎంపీల్లో ఇద్దరు, డీఎంకేకి చెందిన ఎనిమిది మంది ఎంపీల్లో ఇద్దరు, ఎస్పీ (SP)కి చెందిన నలుగురు ఎంపీల్లో ఇద్దరు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ ఎంపీల్లో ముగ్గురు, బీఆర్ఎస్ (BRS)కు చెందిన ముగ్గురు ఎంపీల‌పై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి. సీపీఎం (ముగ్గురు), ఆర్జేడీ (2), ఏఐఏడీఎంకే (1), ఎన్సీపీ (1), ఆప్ (1) చొప్పున క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొంటున్నారు.

31 మంది కోటీశ్వ‌రులు..

ఇక ఎంపీల ఆస్తుల విష‌యానికి వ‌స్తే.. 226 మంది ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.26,047 కోట్లు కాగా, అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీల వాటానే రూ.10,079 కోట్లుగా ఉంది. అందులో తెలంగాణ ఎంపీల ఆస్తుల మొత్తం విలువ రూ.8,130 కోట్లు కాగా.. ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల ఆస్తుల మొత్తం రూ.1949 కోట్లు. రాజ్యసభలో మొత్తం ఎంపీల సగటు ఆస్తులు రూ.115 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. వీరిలో 31 మంది ఎంపీలు తాము కోటీశ్వ‌రుల‌మ‌ని ఎన్నిక‌ల అఫిడ‌విట్ల‌లో తెలిపారు. రూ.100 కోట్ల‌కుపైగా విలువైన ఆస్తులు ఉన్న‌ట్లు తెలిపారు.

అత్యంత సంపన్న ఎంపీల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన బండి పార్థ సారథి రూ.5,300 కోట్లకు పైగా ఆస్తుల‌తో తొలి స్థానంలో ఉన్నారు. బీజేపీకి చెందిన రాజిందర్ గుప్తా (రూ.5,053 కోట్లకు పైగా), కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ (రూ.2,558 కోట్లు), వైఎస్సార్‌సీపీకి చెందిన అల్లా అయోధ్య రామి రెడ్డి (రూ.2,577 కోట్లకు పైగా) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Advertisement
Advertisement