త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bangladesh | గ్యారేజీలో నిద్రిస్తుండ‌గా పెట్రోల్ పోసి నిప్పంటించారు.. బంగ్లాదేశ్‌లో మ‌రో హిందువు దారుణ హ‌త్య‌

Bangladesh | బంగ్లాదేశ్‌(Bangladesh)లో హిందువుల‌పై మార‌ణ‌హోమం కొన‌సాగుతూనే ఉన్న‌ది. హిందువులే ల‌క్ష్యంగా సాగుతున్న దాడుల్లో ఇప్ప‌టికే 13 మంది మ‌ర‌ణించ‌గా, తాజాగా మ‌రో యువ‌కుడు అల్ల‌రి మూక‌ల‌కు బ‌ల‌య్యాడు.

G

International | Published On Jan 25, 2026, 12.30 pm IST

Bangladesh | గ్యారేజీలో నిద్రిస్తుండ‌గా పెట్రోల్ పోసి నిప్పంటించారు.. బంగ్లాదేశ్‌లో మ‌రో హిందువు దారుణ హ‌త్య‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: బంగ్లాదేశ్‌(Bangladesh)లో హిందువుల‌పై మార‌ణ‌హోమం కొన‌సాగుతూనే ఉన్న‌ది. హిందువులే ల‌క్ష్యంగా సాగుతున్న దాడుల్లో ఇప్ప‌టికే 13 మంది మ‌ర‌ణించ‌గా, తాజాగా మ‌రో యువ‌కుడు అల్ల‌రి మూక‌ల‌కు బ‌ల‌య్యాడు. శుక్ర‌వారం రాత్రి ఓ గ్యారేజ్‌లో (garage) నిద్రిస్తున్న హిందూ (Hindu) యువకుడిని సజీవ దహనం చేశారు. ఈ ఘటన న‌ర్సింగ‌డి జిల్లాలో (Narsingdi) చోటుచేసుకున్న‌ది.

చుమిల్లా జిల్లా ల‌క్ష్మీపూర్ గ్రామానికి చెందిన చంచ‌ల్ చంద్ర భౌమిక్ (23).. న‌ర్సింగ‌డిలో నివ‌సిస్తూ.. అక్క‌డే గ‌త కొన్నేండ్లుగా ఓ గ్యారేజీలో ప‌నిచేస్తున్నాడు. శుక్ర‌వారం రాత్రి అత‌డు గ్యారేజీలో ప‌డుకుని ఉండ‌గా అల్ల‌రి మూక‌లు దాడి చేశారు. షట్టర్ మూసివేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో అందులో నిద్రిస్తున్న భౌమిక్ సజీవ దహనం అయ్యాడు. అత‌డు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అల్లరి మూక అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే షాపు బ‌య‌టి నుంచి ఒక వ్య‌క్తి నిప్పంటించి పారిపోతున్న‌ట్లు క‌నిపిస్తున్న‌ సీసీ టీవీ ఫుటేజీ వెలుగులోకి వ‌చ్చింది. అయితే వాటిని ఇంకా అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది. కాగా, చంచ‌ల్‌ని ప‌థ‌కం ప్ర‌కార‌మే హ‌త్య‌చేశార‌ని అత‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడికి తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నారు. వారిలో ఒకరు దివ్యాంగుడు. చంచల్ తండ్రి చాలా కాలం క్రితమే చనిపోయారు. ప్రస్తుతం చంచల్ సంపాదనపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. సంపాదించే పెద్ద దిక్కును కోల్పోయామంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చంపచ‌ల్‌ను కిరాత‌కంగా హ‌త్య చేయ‌డంపై స్థానికులు, బంగ్లాదేశ్‌లోని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హంత‌కుల‌కు క‌ఠిన శిక్ష విధించాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement