త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. వైట్ హౌస్‌లో ఆ వార్తాసంస్థ‌లపై నిషేధం

Donald Trump | అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వైట్ హౌస్‌లోకి సీఎన్ఎన్( CNN ), ఎంఎస్‌నౌ( MSNOW ), పొలిటికో వార్తా సంస్థ‌ల ప్ర‌వేశంపై నిషేధం విధిస్తున్న‌ట్లు ట్రంప్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

S

International | Published On Sep 19, 2026, 7.15 am IST

Donald Trump | ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. వైట్ హౌస్‌లో ఆ వార్తాసంస్థ‌లపై నిషేధం
Advertisement

Donald Trump | త్రినేత్ర‌.న్యూస్ : అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వైట్ హౌస్‌లోకి సీఎన్ఎన్( CNN ), ఎంఎస్‌నౌ( MSNOW ), పొలిటికో వార్తా సంస్థ‌ల ప్ర‌వేశంపై నిషేధం విధిస్తున్న‌ట్లు ట్రంప్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌న్నారు. త‌న‌పై త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చురిస్తున్నందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ట్రంప్ ప‌రిపాల‌న‌పై మీడియా సంస్థలు వార్త‌లు క‌వ‌ర్ చేస్తున్న స‌మ‌యంలో క‌ల్పిత క‌థ‌నాలు, అబ‌ద్ధాల‌ను రాయ‌డం స‌రికాద‌న్నారు. ఇతర ఫేక్ న్యూస్ మీడియా సంస్థలపై కూడా త్వరలో చర్యలు ఉంటాయ‌ని ట్రంప్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement