helicopters collide | రెండు హెలికాప్టర్లు ఢీ.. వరల్డ్ టూర్‌లో ఉన్న ప్రముఖ సింగర్ మృతి
helicopters collide | బ్రెజిల్‌లో (Brazil) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రియో డి జెనిరోలో (Rio De Janeiro) రెండు హెలికాప్టర్లు ఢీ కొన్నాయి (helicopters collide).
International | Published On Jun 15, 2026, 3.11 pm IST
helicopters collide | బ్రెజిల్‌లో (Brazil) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రియో డి జెనిరోలో (Rio De Janeiro) రెండు హెలికాప్టర్లు ఢీ కొన్నాయి (helicopters collide). ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఓ ప్రముఖ సింగర్ కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
యూరోకాప్టర్ AS350, బెల్ 206 రకాలకు చెందిన రెండు హెలికాప్టర్లు రియో నగరానికి పశ్చిమ ప్రాంతంలోని రెక్రియో డోస్ బాందీరాంటెస్‌లో (Recreio dos Bandeirantes) కూలిపోయినట్లు బ్రెజిల్ అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గగనతలంలో ఒకదానికొకటి ఢీకొని నేలకూలినట్లు చెప్పారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీగా మంటలు చెలరేగినట్లు చెప్పారు. రోడ్డుపై ఉన్న పలు వాహనాలకు కూడా మంటలు అంటుకున్నట్లు వివరించారు. ఈ ఘటనలో 20 లగ్జరీ కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు చెప్పారు.
ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అమెరికన్ సింగర్ 32 ఏళ్ల ఒలివర్ ట్రీతో పాటు అర్జెంటీనాకు చెందిన ప్రముఖ యూట్యూబర్, దర్శకుడు, మ్యూజిక్ ప్రొడ్యూసర్, ఇద్దరు పైలట్లు ఉన్నారు. సింగర్ ఒలివర్‌కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వరల్డ్ టూర్‌లో భాగంగా బ్రెజిల్‌లో పర్యటిస్తున్నారు. ఆయన మరణంతో సంగీత ప్రపంచంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు గంటపాటూ శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
⚠️URGENTE: Colisão entre dois helicópteros termina em queda das aeronaves e seis mortes no Recreio dos Bandeirantes, no Rio de Janeiro. pic.twitter.com/YvYOovKVbe
— DELATEI (@Delateinews) June 14, 2026
Also Read..
నోయిడా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు మొదలు.. తొలి విమానంలో ప్రయాణించిన భూములిచ్చిన రైతులు
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ
వాహనదారులకు ఈ20 పెట్రోల్ షాక్.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదట..
తాజావార్తలు
- ●Heavy Rains | ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశం
- ●NSE | ఎన్ఎస్ఈ ఐసీవోకు గ్రీన్ సిగ్నల్.. 10 ఏళ్ల నిరీక్షణకు తెర.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..
- ●Rani Rudrama Reddy | రాంచందర్‌రావుకు హిట్లర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : రాణీ రుద్రమారెడ్డి
- ●Revanth Reddy | ఎన్వోసీ ఇవ్వండి.. మెట్రో ఫేజ్-2 కట్టుకుంటాం
- ●PM Modi | సమగ్ర భాగస్వామ్య స్థాయికి భారత్-స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాలు : ప్రధాని మోదీ
- ●ITR | ఐటీఆర్ గడువు దాటితే.. ఫైలింగ్ చేయలేమా.. ఏం జరుగుతుంది..?

Heavy Rains | ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశం

NSE | ఎన్ఎస్ఈ ఐసీవోకు గ్రీన్ సిగ్నల్.. 10 ఏళ్ల నిరీక్షణకు తెర.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..

Rani Rudrama Reddy | రాంచందర్‌రావుకు హిట్లర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : రాణీ రుద్రమారెడ్డి

Revanth Reddy | ఎన్వోసీ ఇవ్వండి.. మెట్రో ఫేజ్-2 కట్టుకుంటాం




