Revanth Reddy | ఎన్‌వోసీ ఇవ్వండి.. మెట్రో ఫేజ్-2 కట్టుకుంటాం
Revanth Reddy | ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఒక్కటే ఏకైక పరిష్కారం అని కేంద్రం చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ఎన్‌వోసీ ఇస్తే తామే పూర్తిగా భరించి మెట్రో విస్తరణ చేసుకుంటామన్నారు. మెట్రో విస్తరణపై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు.
- మేం IRFCని లోన్‌కు ఒప్పించాం
- రూ.1400 కోట్లు కట్టి లోన్ వచ్చిందనుకున్నాం
- కానీ కిషన్‌రెడ్డి అడ్డుపడ్డారు.. అందుకే ఆయన వెనక పడుతున్నాం
- కేటీఆర్ కుట్రలకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు
- 122 కి.మీ రెండో దశకు కేంద్రం భాగస్వామ్యం తీసుకుంటుందో లేదో ఆయనే చెప్పాలి
- మీ ఎంపీలున్న ప్రాంతాల్లోనే విస్తరణ ఉంది
- ఎల్ అండ్ టీని అడిగితే నష్టాల్లో ఉన్నామని చెప్పింది
- మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఒక్కటే ఏకైక పరిష్కారం అని కేంద్రం చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ఎన్‌వోసీ ఇస్తే తామే పూర్తిగా భరించి మెట్రో విస్తరణ చేసుకుంటామన్నారు. 50 శాతం కూడా భాగస్వామ్యం అవసరం లేదని చెప్పారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కిషన్‌రెడ్డి వెనుక కేటీఆర్ ఉండి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మెట్రో విస్తరణపై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు.
మొదటి దశ మూడేళ్లు ఆలస్యమైంది..
జంటనగరాల ప్రజలకు, CURE పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతర్జాతీయ నగరానికి అంతర్జాతీయ ప్రమాణాలతో రవాణా సౌకర్యాలు ఉండాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వైఎస్ హయాంలో నాటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి జైపాల్ రెడ్డి హైదరాబాద్‌కు మెట్రో ప్రాజెక్టు తీసుకొచ్చారు. వైఎస్ మరణానంతరం రోశయ్య హయాంలో మొదటి దశ మెట్రో కోసం ఒప్పందాలు జరిగాయి. 2017 నాటికి మెట్రో మొదటి దశ పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రాజెక్టు మొదలైంది. తెలంగాణ వచ్చాక చారిత్రక కట్టడాల సాకుతో మెట్రో మొదటి దశను అడ్డుకున్నారు. కేసీఆర్ చర్యలతో మెట్రో మొదటి దశ మూడేళ్లు ఆలస్యమైంది. రూ.15 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు రూ.22 వేల కోట్లకు చేరింది అని సీఎం రేవంత్ ఆరోపించారు.
కేంద్రం నిబంధన పెట్టింది..
ప్రాజెక్టు ఆలస్యం, కొవిడ్ ప్రభావంతో ఎల్ అండ్ టీ నష్టాల్లో కూరుకుపోయింది. బీఆర్ఎస్ వాళ్లు ఆస్తులు పెంచుకునేందుకు తప్ప ప్రజల కోసం ఆలోచించలేదు. దీంతో హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి పడిపోయింది. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెట్రో విస్తరణ జరగాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఫేజ్ 2 కోసం ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశాం. ఫేజ్ 1 నిర్మించిన ఎల్ అండ్ టీ తోనే ఫేజ్ 2 నిర్మించాల్సి ఉంటుందని కేంద్రం నిబంధన పెట్టింది. కానీ ఈ ప్రతిపాదనకు ఎల్ అండ్ టీ అంగీకరించలేదు. గత నష్టాలతోనే సతమతమవుతున్న తమకు ఫేజ్ 2 నిర్మించడం కష్టమని తేల్చి చెప్పింది. రూ.30 వేల కోట్ల ఆస్తి సృష్టించినా ఏటా రూ.400 కోట్లు నష్టం వస్తుందని చెప్పింది. అందుకే ఫేజ్ 2 నిర్మాణంలో భాగస్వామ్యం కామని స్పష్టంగా చెప్పింది. భవిష్యత్ నిర్వహణకు కూడా ఒప్పుకోమని తిరస్కరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి అడిగాం. ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఒక్కటే ఏకైక పరిష్కారం అని కేంద్రం చెప్పింది అని రేవంత్ రెడ్డి తెలిపారు.
లోన్ బదిలీ చేయాలని కోరాం..
రూ.30 వేల కోట్ల ఎల్ అండ్ టీ మెట్రో ఆస్తిని రూ.15 వేల కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 8.25 శాతం వడ్డీకి బ్యాంకుల్లో రూ.13,600 కోట్లు ఎల్ అండ్ టీ మెట్రోపై రుణం తెచ్చుకుంది. ఆ లోన్ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. IRFC ద్వారా తక్కువ వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకోవడానికి కేసీఆర్‌కు PFC, REC ద్వారా పదేళ్లలో రూ.3 లక్షల 15 వేల కోట్లు ఎలాంటి గ్యారెంటీ లేకుండా, మూడో కంటికి తెలియకుండా కేంద్రం అప్పు ఇచ్చింది. 9-11.5 శాతం వడ్డీతో అప్పులు ఇచ్చారు. మేం IRFCని లోన్‌కు ఒప్పించాం. రూ.13,600 కోట్లు 4 శాతం వడ్డీకి జపాన్ సంస్థతో అప్పు తీసుకొచ్చాం. ఇది IRFC నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కావాల్సి ఉంది. రూ.1400 కోట్లు మేం కట్టాల్సింది కట్టాం. లోన్ వచ్చినట్లే అని అనుకుంటే కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. మే 20న ఖట్టర్‌ను, 21న అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఇవ్వొద్దని చెప్పారు. అందుకే మేం కిషన్ రెడ్డి వెనక పడుతున్నాం. ఇవాళ నిధులు విడుదల కావాల్సి ఉంది.. ఆ బాధ్యత కిషన్ రెడ్డిదే అని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు.
కిషన్‌రెడ్డి కలిశాక పనులు స్లో అయ్యాయి..
మీరు సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు. నలుగురు మీ ఎంపీలు ఉన్న ప్రాంతంలోనే మెట్రో విస్తరణ జరగాల్సి ఉంది. కిషన్ రెడ్డి ఎందుకు బాధ్యత తీసుకోరు? వరంగల్ ఎయిర్‌పోర్టు స్పీడ్ అయ్యాక వెళ్లి రామ్మోహన్ నాయుడిని కలిశాడు. ఆ పనులు స్లో అయ్యాయి. జపాన్ సంస్థ ఇప్పటికే నిధులను IRFCకి విడుదల చేసింది. కానీ IRFC రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం లేదు. ఆ డబ్బులకు వడ్డీ ఎవరు కట్టాలి. కిషన్ రెడ్డి చెప్పాలి. రిజర్వు బ్యాంకును ఒప్పించిన లెటర్ కూడా తీసుకెళ్లి ఇచ్చాం. అయినా లోన్ ట్రాన్స్ఫర్ కాకుండా అడ్డుకున్నారు. దీనిపై కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుంటారా లేదా? లేకపోతే NOC ఇచ్చి మీ భాగస్వామ్యం వదులుకుంటారా? అలా చేస్తే మేమే మెట్రో ఫేజ్ 2 కట్టుకుంటాం అని రేవంత్ వ్యాఖ్యానించారు.
పల్లెత్తు మాట అనలేదు..
కేసీఆర్ రండ అని మాట్లాడితే ఆయన్ను కిషన్ రెడ్డి పల్లెత్తు మాట అనలేదు. ఎదురు చెప్పలేదు. మేమేం అనకపోయినా మాపై సవాళ్లు విసురుతున్నారు. 122 కి.మీ మెట్రో రెండో దశకు కేంద్రం భాగస్వామ్యం తీసుకుంటుందా లేదా? మెట్రో ఫేజ్ 2కు NOC ఇస్తారా లేదా? కిషన్ రెడ్డి చెప్పాలి? ఇవాళ ట్రాన్స్‌ఫర్ కావాల్సిన లోన్‌ను ట్రాన్స్‌ఫర్ చేయించండి. కిషన్ రెడ్డిపై మాకు గౌరవం ఉంది. కిషన్ రెడ్డి వెనక కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ కుట్రలకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
జూన్ 15, 2026

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
జూన్ 15, 2026

Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా ‘డ్యాన్సింగ్ డాఫోడిల్స్’!
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!
- ●KTR | చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుప్పిగంతులు

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి

Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?



