Neymar | బ్రెజిల్‌కు షాక్.. తొలి మ్యాచ్‌కు నెయ్‌మార్ దూరం
Neymar | ఫిఫా ప్రపంచకప్-2026 ప్రారంభ దశలోనే బ్రెజిల్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ గాయం కారణంగా జట్టు తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. గ్రూప్ దశలోని కొన్ని మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.
Neymar | ఫిఫా ప్రపంచకప్-2026 ప్రారంభ దశలోనే బ్రెజిల్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ గాయం కారణంగా జట్టు తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. గ్రూప్ దశలోని కొన్ని మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. అమెరికా-మెక్సికో-కెనడా సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో మెక్సికో విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా ఉత్కంఠభరిత పోరులో చెక్ రిపబ్లిక్‌ను ఓడించింది. ఇక బ్రెజిల్ ఆదివారం తమ తొలి మ్యాచ్‌లో మొరాకోతో తలపడనుంది. ఈ నేపథ్యంలో జట్టు హెడ్ కోచ్ కార్లో అన్సెలోట్టి మీడియాతో మాట్లాడుతూ నెయ్‌మార్ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు వెల్లడించాడు.
ప్రస్తుతం అతడు కోలుకునేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడని, వచ్చే వారం నాటికి జట్టుతో చేరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐదుసార్లు ప్రపంచకప్ గెలిచిన బ్రెజిల్ జట్టులో నెయ్‌మార్ కీలక ఆటగాడు. దాంతో అతను అందుబాటులో లేకపోవడంతో జట్టుపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తొలి మ్యాచ్‌కే అతడు అందుబాటులో ఉండడంలేదన్న వార్తలతో అభిమానులకు నిరాశకు గురవుతున్నారు. మరోవైపు బ్రెజిల్ ఫుట్‌బాల్ చరిత్రలో తొలిసారి విదేశీ కోచ్‌గా కార్లో అన్సెలోట్టి బాధ్యతలు స్వీకరించారు. ఆయన శిక్షణలో జట్టు ఎలా రాణిస్తుందనేది సర్వత్రా అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. ఫిఫా వరల్డ్ కప్‌లో ఆయన వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.
సంబంధిత వార్తలు

MP Chamala | నిపర్‌లో పారదర్శకతపై చర్యలు తీసుకోవాలి : ఎంపీ చామల
జూన్ 15, 2026

Hyderabad Police | ప్రజాశాంతికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్
జూన్ 15, 2026

Waterlogging Hotspots | మొదలైన వానలు.. వరద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా, ట్రాఫిక్ ఉన్నతాధికారుల పర్యటన
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●MP Chamala | నిపర్‌లో పారదర్శకతపై చర్యలు తీసుకోవాలి : ఎంపీ చామల
- ●Ajith Daughter | హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా?
- ●Hyderabad Police | ప్రజాశాంతికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్
- ●OTT | ఓటీటీలోకి తెలుగు వయలెంట్ యాక్షన్ మూవీ - థియేటర్లలో జీరో కలెక్షన్స్‌తో చెత్త రికార్డ్
- ●Waterlogging Hotspots | మొదలైన వానలు.. వరద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా, ట్రాఫిక్ ఉన్నతాధికారుల పర్యటన
- ●Golconda Murder Case | చెల్లెలి ప్రేమ వివాహం.. పగతో రగిలిన అన్న..

MP Chamala | నిపర్‌లో పారదర్శకతపై చర్యలు తీసుకోవాలి : ఎంపీ చామల

Ajith Daughter | హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా?

Hyderabad Police | ప్రజాశాంతికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్

OTT | ఓటీటీలోకి తెలుగు వయలెంట్ యాక్షన్ మూవీ - థియేటర్లలో జీరో కలెక్షన్స్‌తో చెత్త రికార్డ్



