Rani Rudrama Reddy | రాంచందర్‌రావుకు హిట్లర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : రాణీ రుద్రమారెడ్డి
Rani Rudrama Reddy | బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత రాణీ రుద్రమారెడ్డి ఖండించారు. రాంచందర్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి అలియాస్ హిట్లర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వ్యవహార శైలి రోజురోజుకూ నియంతృత్వ ధోరణిని తలపిస్తోందని విమర్శించారు.
Rani Rudrama Reddy | బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత రాణీ రుద్రమారెడ్డి ఖండించారు. రాంచందర్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి అలియాస్ హిట్లర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వ్యవహార శైలి రోజురోజుకూ నియంతృత్వ ధోరణిని తలపిస్తోందని విమర్శించారు. ఇతర రాజకీయ పార్టీల నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్న ఆమె.. తమ పార్టీ అధ్యక్షుడిని కమెడియన్‌తో పోల్చి హేళనగా మాట్లాడడం వారి వ్యక్తిత్వ లోపానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఆ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ నాయకులపై వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేత కాక రోజుకొక బీజేపీ నేతపై వ్యక్తిగత దాడి చేస్తూ మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. మెట్రో విస్తరణ అంశాన్ని ప్రస్తావిస్తూ.. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ప్రాజెక్టు పురోగతిలో స్పష్టత లేదన్నారు. అధికారం లోకి వచ్చి రెండున్నర ఏండ్లైన మెట్రో విషయంలో ఎల్ అండ్ టీ కంపెనీని ఒప్పించడానికే ఇవాళ్టి దాకా హిట్లర్ రెడ్డి సమయం పట్టిందని, కేంద్రం ఎక్కడ అడ్డుకుందంటూ నిలదీశారు. అలాగే కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్ మధ్య జరిగిన చర్చలపై సీఎం మాట్లాడటాన్ని తప్పుపట్టారు. "హిట్లర్ రెడ్డి తలుపు చాటు నుంచి దొంగ లాగా ముచ్చట్లు వింటున్నారా? అశ్వినీ వైష్ణవ్‌తో కిషన్‌రెడ్డి ఏం మాట్లాడారో ఏం తెలుసు అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన ఆమె.. హామీలు నెరవేర్చడం, ప్రాజెక్టులు కట్టడం, పరిపాలన చేతకాదంటూ విమర్శలు గుప్పించారు. అసలు రాష్ట్ర ఆదాయం ఎక్కడికి పోతుందంటూ నిలదీశారు. రాష్ట్ర నిధుల వినియోగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని గతంలో బీఆర్ఎస్ ప్రయత్నించిందని, ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. కాంగ్రెస్ కొనసాగిస్తే ఇదే విధానాన్ని కొనసాగిస్తే ప్రజలు ఆ పార్టీని కూడా తిరస్కరిస్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సహకరించకపోయినా కేంద్రం రూ.13లక్షల కోట్లతో తెలంగాణను అభివృద్ధి చేసిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం పాత్రను గుర్తించాలని హితవు పలికారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
జులై 18, 2026

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 18, 2026

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
జులై 18, 2026
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి



