Preity Mukhundhan | ఓటీటీలోకి ప్రీతిముకుందన్ మూవీ.. రేపటి నుంచి బ్లాస్ట్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Preity Mukhundhan | సినీప్రియులకు గుడ్‌న్యూస్. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకున్నా ప్రీతిముకుందన్, అర్జున్ సర్జా నటించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మౌత్ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
Entertainment | Published On Jun 24, 2026, 8.20 am IST
Preity Mukhundhan | సినీప్రియులకు గుడ్‌న్యూస్. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకున్నా ప్రీతిముకుందన్, అర్జున్ సర్జా నటించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మౌత్ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. పెద్దగా అంచనాలు లేకుండా మే 28న థియేటర్లలో విడుదలైన ‘బ్లాస్ట్’ తర్వాతి రోజుల్లో పాజిటివ్ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంది. కథలోని టెన్షన్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేశాయి. సీనియర్ నటుడు అర్జున్ సర్జా తనదైన శైలిలో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించగా.. ప్రీతి ముకుందన్ తన పాత్రకు న్యాయం చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అభిరామి, జాన్ కొక్కెన్ వంటి నటులు కూడా కీలక పాత్రల్లో మెప్పించారు.
ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా.. సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. సాంకేతికంగా కూడా సినిమా మంచి మార్కులే పడ్డాయి. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉండగా.. హీరోయిన్ ప్రీతి ముకుందన్ మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ‘బ్లాస్ట్’ సినిమాతో ఆమెకు గుర్తింపు మరింత పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సహజమైన నటనతో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా యంగ్ ఆడియన్స్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ప్రీతి ముకుందన్ కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఓ సినిమా చేస్తోంది. తమిళంలో ఇదయం మురళీ, దశకామన్, తెలుగులో ఏమో ఏమో ఇది, హిందీలో నాగ్జిల్లా చిత్రాల్లో నటిస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Veerangana Rani Durgavati Mandavi | మొఘలుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరనారి: ఎవరీ 'రాణీ దుర్గావతి'? ఏమా కథ?
- ●Tungabhadra Water Share | తుంగభద్ర జలాల్లో మన వాటా ఏదీ? ఆర్డీఎస్ పనులపై కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
- ●Sanjay Jaju IAS | తెలంగాణ నూతన సీఎస్.. రేవంత్ సర్కార్ గురి 'మీసేవ' సృష్టికర్తపైనే
- ●Mumbai Local Train Murder | నిందితుడిని ఉరి తీయాల్సిందే.. అసలు ఫస్ట్ క్లాస్ బోగీలోకి కత్తి ఎలా వచ్చింది?
- ●Telangana Bonalu 2026 | బోనమెత్తనున్న భాగ్యనగరం: రూ.20 కోట్లతో ఘనంగా ఏర్పాట్లు.. జూలై 16 నుంచి షురూ!
- ●Dasoju Sravan | మెట్రో రైల్ రేవంత్ తాత జాగీరా? తొందరలోనే బీజేపీలోకి పోతడు

Veerangana Rani Durgavati Mandavi | మొఘలుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరనారి: ఎవరీ 'రాణీ దుర్గావతి'? ఏమా కథ?

Tungabhadra Water Share | తుంగభద్ర జలాల్లో మన వాటా ఏదీ? ఆర్డీఎస్ పనులపై కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

Sanjay Jaju IAS | తెలంగాణ నూతన సీఎస్.. రేవంత్ సర్కార్ గురి 'మీసేవ' సృష్టికర్తపైనే

Mumbai Local Train Murder | నిందితుడిని ఉరి తీయాల్సిందే.. అసలు ఫస్ట్ క్లాస్ బోగీలోకి కత్తి ఎలా వచ్చింది?






