Shruti Haasan | అప్పుడు నాన్నకు బాగా కోపం వచ్చింది.. చిన్ననాటి సంఘటనను గుర్తుచేసుకున్న శ్రుతి హాసన్
Shruti Haasan | నటి శ్రుతి హాసన్ తన టీనేజ్ రోజుల నాటి ఓ ఆసక్తికర సంఘటనను అభిమానులతో పంచుకుంది. 19 ఏళ్ల వయసులో తాను తీసుకున్న ఓ నిర్ణయం తన తండ్రి, విశ్వనటుడు కమల్ హాసన్‌కు తీవ్ర కోపం తెప్పించిందని వెల్లడించింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) సెషన్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు శ్రుతి సమాధానాలు ఇచ్చింది.
Entertainment | Published On Jun 24, 2026, 7.51 am IST
Shruti Haasan | నటి శ్రుతి హాసన్ తన టీనేజ్ రోజుల నాటి ఓ ఆసక్తికర సంఘటనను అభిమానులతో పంచుకుంది. 19 ఏళ్ల వయసులో తాను తీసుకున్న ఓ నిర్ణయం తన తండ్రి, విశ్వనటుడు కమల్ హాసన్‌కు తీవ్ర కోపం తెప్పించిందని వెల్లడించింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) సెషన్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు శ్రుతి సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ అభిమాని, “మీకు బెల్లీ బటన్ పియర్సింగ్ ఉందా? ఉంటే ఎప్పుడు చేయించుకున్నారు?” అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన శ్రుతి.. తన బెల్లీ బటన్ పియర్సింగ్‌కు సంబంధించిన ఫొటోను పంచుకుంటూ ఆ రోజులను గుర్తు చేసుకుంది. “అవును, నాకు పియర్సింగ్ ఉంది. 19 ఏళ్ల వయసులో చేయించుకున్నాను.
ఆ విషయం తెలిసి మా నాన్న చాలా చాలా కోప్పడ్డారు” అని పేర్కొంది. ఈ పోస్టుకు #TeenageRebel’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను యాడ్ చేసింది. కమల్ హాసన్, నటి సారిక దంపతుల పెద్ద కుమార్తె అయిన శ్రుతి హాసన్, తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి గతంలోనూ పలుమార్లు ప్రస్తావించింది. ఇద్దరి మధ్య ఉండే సరదా సంభాషణలు, ఆప్యాయ అనుబంధానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కమల్ హాసన్, సారిక దంపతులకు మరో కుమార్తె అక్షర హాసన్ కూడా ఉంది. కొంతకాలం క్రితం తండ్రి-కూతుళ్ల మధ్య ఉన్న సరదా బంధాన్ని ప్రతిబింబించే ఓ వీడియోను శ్రుతి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ కార్యక్రమానికి సిద్ధమవుతూ మేకప్ చేయించుకుంటున్న సమయంలో ఆమె తన తండ్రికి ఫోన్ చేసింది.
“హాయ్ అప్పా.. ఇంకా నిద్రపోతున్నారా?” అంటూ అడిగిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. అదే వీడియోలో తన మేకప్ టీమ్‌తో సరదాగా ముచ్చటిస్తూ శ్రుతి చమత్కరించింది. “ఇన్‌సర్ట్ కాదు... ఇన్‌సల్ట్. ఇంగ్లిష్ భాష చనిపోయేది ఇక్కడే” అంటూ వ్యాఖ్యానించగా అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇక సినీ ప్రస్థాన విషయానికి వస్తే శ్రుతి హాసన్ 2009లో విడుదలైన హిందీ చిత్రం ‘లక్’తో హీరోయిన్‌గా బిగ్ స్క్రీన్‌పై మెరిసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ‘రేసుగుర్రం’, ‘శ్రీమంతుడు’, ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’, ‘వేదాళం’, ‘క్రాక్’ తదితర విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం తమిళంలో ట్రైన్, తెలుగులో ఆకాశమంత చిత్రాల్లో నటిస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Abhishek Porel | పెండ్లి పేరుతో మోసం చేశాడు.. ఐపీఎల్ ఆటగాడిపై యువతి ఫిర్యాదు
- ●Preity Mukhundhan | ఓటీటీలోకి ప్రీతిముకుందన్ మూవీ.. రేపటి నుంచి బ్లాస్ట్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- ●Delhi Fire | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 25 ఫైర్‌ఇంజిన్లతో అదుపులోకి..
- ●Panama Vs Croatia | పనామాపై క్రొయేషియా విక్టరీ
- ●Ambedkar Open University | అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
- ●Englad Vs Ghana | తడబడిన ఇంగ్లండ్

Abhishek Porel | పెండ్లి పేరుతో మోసం చేశాడు.. ఐపీఎల్ ఆటగాడిపై యువతి ఫిర్యాదు

Preity Mukhundhan | ఓటీటీలోకి ప్రీతిముకుందన్ మూవీ.. రేపటి నుంచి బ్లాస్ట్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Delhi Fire | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 25 ఫైర్‌ఇంజిన్లతో అదుపులోకి..

Panama Vs Croatia | పనామాపై క్రొయేషియా విక్టరీ




