Delhi Fire | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 25 ఫైర్ఇంజిన్లతో అదుపులోకి..
Delhi Fire | ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం (Delhi Fire) జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్లమ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.
Delhi Fire | త్రినేత్ర.న్యూస్: ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో (Udyog Bhawan) భారీ అగ్నిప్రమాదం (Delhi Fire) జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్లమ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సుమారు 25 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అగ్నికీలలు ఎగసి పడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకున్నది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రిక్ ప్యానల్‌లో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి సమీపంలోని గుడిసెలకు వ్యాపించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. రాత్రి 11.22 గంటలకు మంటలు చెలరేగాయని ఢిల్లీ ఫైర్ ఆఫీసర్ సందీప్ దుగ్గల్ తెలిపారు. సేనా భవన్ సమీపంలో భవన నిర్మాణ కార్మికులు తాత్కాలికంగా గుడిసెలు ఏర్పాటు చేశారని చెప్పారు. అక్కడ చిన్నిచిన్న ఎల్పీజీ సిలిండర్లు, కరెంటు వైర్లు కూడా ఉన్నాయి. దీంతో ప్రమాదానికి కారణం ఏంటనేది స్పష్టంగా ఇప్పుడే చెప్పలేం. ఆ రెండిట్లో ఏదో ఒకటి కారణమై ఉండొచ్చు. సుమారు 25 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశాం. దీనికోసం తాము మూడు గంటలు శ్రమించాల్సి వచ్చింది అని చెప్పారు.
#WATCH | Delhi | Fire fighting operations underway in the slums near Udyog Bhawan area. 20 fire fighting units present at the scene. The fire has been brought under control. Further details awaited. pic.twitter.com/dHkX2F6kK5
— ANI (@ANI) June 24, 2026
#WATCH | Delhi | Fire Officer Sandeep Duggal says, "... This is near Sena Bhawan and this is a temporary construction for the labourers to stay... Their camp is set up here... Small LPG cylinders are being used here, and there are electric wires spread inside as well, so we… https://t.co/YCjDFy9iEm pic.twitter.com/hhrF1GCmMh
— ANI (@ANI) June 24, 2026
సంబంధిత వార్తలు

Delhi Fire | భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. రూ.లక్షల్లో నష్టం..!
జులై 1, 2026

Delhi Hotel Fire | అగ్నిప్రమాదంలో 13 మంది విదేశీయులు మరణించారు : విదేశాంగ శాఖ
జూన్ 5, 2026

Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం: ప్రాణాలు కాపాడేందుకు పరుపులనే ‘సేఫ్టీ నెట్’గా మార్చి.. 2 లక్షలు నష్టపోయిన వ్యాపారి
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్

Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!



