Heat Wave | 48 గంటల పాటు దంచికొట్టనున్న ఎండలు.. ఉత్తర తెలంగాణకు వడగాల్పుల హెచ్చరిక
Heat Wave | నైరుతి రుతుపవనాలు( Monsoon ) రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించలేదు. దీంతో ఎండల తీవ్రత( Heat Wave ) కొనసాగుతూనే ఉంది. భారీగా ఉష్ణోగ్రతలు 9 Temperatures )నమోదవుతున్నాయి. రాబోయే 48 గంటల పాటు ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం( IMD Hyderabad ) వెల్లడించింది.
Heat Wave | త్రినేత్ర.న్యూస్ : నైరుతి రుతుపవనాలు( Monsoon ) రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించలేదు. దీంతో ఎండల తీవ్రత( Heat Wave ) కొనసాగుతూనే ఉంది. భారీగా ఉష్ణోగ్రతలు 9 Temperatures )నమోదవుతున్నాయి. రాబోయే 48 గంటల పాటు ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం( IMD Hyderabad ) వెల్లడించింది.ఈ క్రమంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో జూన్ 22, 23 తేదీల తర్వాత నైరుతి రుతుపవనాలు బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆ తర్వాత వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఏపీలోనూ ఇంకా నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించలేదు. వాస్తవానికి జూన్ 4 నుంచి 15వ తేదీ మధ్య దేశంలో సాధారణ వర్షపాతం 53.7 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి.. కానీ కేవలం ఈ తేదీల మధ్యలో 19.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తానికి దేశ వ్యాప్తంగా 64 శాతం వర్షపాత లోటు ఏర్పడింది.
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!





