త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian truck drivers | అమెరికాలో 30 మంది భార‌తీయ ట్ర‌క్కు డ్రైవ‌ర్లు అరెస్టు

Indian truck drivers | అమెరికాలో కమర్షియల్ ట్రక్కులు నడుపుతూ జీవనం సాగిస్తున్న 30 మంది భారతీయులను (Indian truck drivers) యూఎస్ సరిహద్దు రక్షణ ద‌ళం (US Border Patrol agents) అరెస్ట్ చేసింది. వారంద‌రినీ తిరిగి స్వదేశాల‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

D

International | Published On Jun 2, 2026, 12.06 pm IST

Indian truck drivers | అమెరికాలో 30 మంది భార‌తీయ ట్ర‌క్కు డ్రైవ‌ర్లు అరెస్టు
Advertisement

Indian truck drivers | అమెరికాలో అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై ట్రంప్ యంత్రాంగం ఉక్కుపాదం మోతుపుతోంది. దేశంలో అక్ర‌మంగా నివాసం ఉంటున్న విదేశీయుల‌ను గుర్తించి వారిని స్వ‌దేశాల‌కు సాగ‌నంపుతోంది. ఈ క్రమంలోనే అమెరికాలో కమర్షియల్ ట్రక్కులు నడుపుతూ జీవనం సాగిస్తున్న 30 మంది భారతీయులను (Indian truck drivers) యూఎస్ సరిహద్దు రక్షణ ద‌ళం (US Border Patrol agents) అరెస్ట్ చేసింది. ఫెడ‌రల్ ఆప‌రేష‌న్‌లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్న‌ట్లు అమెరికా క‌స్ట‌మ్స్ అండ్ బోర్డ‌ర్ ప్రొటెక్ష‌న్ విభాగం ప్ర‌క‌టించింది.

ఆప‌రేష‌న్ చెక్‌మేట్ (Operation Checkmate)లో భాగంగా మే 11 నుంచి 15వ తేదీ మ‌ధ్య అరిజోనాలోని యుమా సెక్టార్‌లో మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు క‌స్ట‌మ్స్ అండ్ బోర్డ‌ర్ ప్రొటెక్ష‌న్ (US Customs and Border Protection) అధికారులు తెలిపారు. అందులో 36 మంది సెమీ ట్ర‌క్కు డ్రైవ‌ర్లు అని.. వారిలో 30 మంది భార‌తీయులుగా గుర్తించిన‌ట్లు వెల్ల‌డించారు. మిగితా ఆరుగురిలో మెక్సికో, ఎల్ సాల్వ‌డార్‌, ర‌ష్యాకు చెందిన వారు ఉన్నారు. అరెస్టైన వారిలో కొంద‌రికి కాలిఫోర్నియా, న్యూయార్క్‌, వాషింగ్ట‌న్‌, వ‌ర్జీనియా రాష్ట్రాల‌కు చెందిన క‌మ‌ర్షియ‌ల్ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి.

అయితే కొంతమంది వద్ద కనీసం ఎలాంటి లైసెన్సులు కూడా లేవని దర్యాప్తులో తేలింది. డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉన్నప్పటికీ.. వారు దేశంలో నివసించడానికి అవసరమైన లీగల్ వీసా లేదా ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకపోవడంతో వారందరినీ అక్రమ వలసదారులుగానే పరిగణించారు. అరెస్టైన వారంద‌రినీ తిరిగి స్వదేశాల‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

Also Read..

ప్రెస్ మీట్‌కైనా అనుమ‌తిస్తారా..? ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకుందాం.. కేటీఆర్ పిలుపు

దేశ ప్రగతిలో తెలంగాణ కీల‌క పాత్ర పోషించాలి : గ‌వ‌ర్న‌ర్ శివ్‌ ప్ర‌తాప్ శుక్లా

Advertisement
Advertisement