Iran War | 20కిపైగా సైనిక స్థావరాలు ధ్వంసం.. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం
Iran War | ఇరాన్‌తో యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ జరిపిన దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలకు (air defence systems) మిలియన్ల కొద్దీ డాలర్ల నష్టం వాటిల్లినట్లు బీబీసీ నివేదించింది.
International | Published On Jun 1, 2026, 4.07 pm IST
Iran War | ఇరాన్‌తో (Iran War) దాదాపు మూడు నెలలుగా సాగుతున్న యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు (US Infrastructure Hit Hard) తెలుస్తోంది. ఈ యుద్ధంలో అమెరికా మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గల్ఫ్ రీజియన్‌లోని కీలకమైన అమెరికా సైనిక స్థావరాలను (US Military Sites Damaged) ఇరాన్ లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్న విషయం తెలిసిందే.
ఇరాన్ జరిపిన దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతంలోని (Gulf Countries) అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలకు (air defence systems) మిలియన్ల కొద్దీ డాలర్ల నష్టం వాటిల్లినట్లు బీబీసీ నివేదించింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ కనీసం 20కిపైగా అమెరికా సైనిక స్థావరాలను దెబ్బతీసినట్లు సదరు నివేదిక వెల్లడించింది. ఈ మేరకు శాటిలైట్ చిత్రాలు, వీడియోల ఆధారంగా బీబీసీ ఈ విషయాన్ని వెల్లడించింది.
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతార్, కువైట్, ఇరాక్, జోర్డాన్, బహ్రెయిన్, ఒమన్‌లలోని దాదాపు 28 అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థలు, రీఫ్యూయలింగ్ విమానాలు, రాడార్లు దెబ్బతిన్నాయని పేర్కొంది. దీని వల్ల మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు తెలిపింది.
Also Read..
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన గర్భిణి.. గవర్నర్ కాన్వాయ్‌కి అడ్డుగా రోడ్డుపై బైఠాయించిన భర్త
విద్యుత్ లేకపోయినా నెట్ ఆగదు.. పోర్ట్రానిక్స్ కొత్త కినెటిక్స్ 8కె మినీ యూపీఎస్ విడుదల..
స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఒక్కరోజే రూ.4.26 లక్షల కోట్ల సంపద ఆవిరి..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vaibhav Suryavanshi | టీమిండియా జెర్సీలో వైభవ్ సూర్యవంశీ..? బీసీసీఐ కార్యదర్శి ఏమన్నారంటే..!
- ●India US Trade Deal | భారత్-అమెరికా మెగా ట్రేడ్ డీల్ రెడీ: 99 శాతం చర్చలు పూర్తి.. త్వరలోనే గుడ్‌న్యూస్
- ●Rashmika Mandanna | రష్మిక తగ్గేదేలే ... బాలీవుడ్ సినిమాకు నేషనల్ క్రష్ రెమ్యూనరేషన్ చూస్తే మైండ్ బ్లాకే!
- ●Traffic Restrictions | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రేపు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
- ●Supreme Court | సీబీటీ విధానం కుదరదు.. నీట్ రీ ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- ●HCA | హెచ్‌సీఏ నిధుల అక్రమాలపై సిట్ దర్యాప్తు.. త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న సిట్..!

Vaibhav Suryavanshi | టీమిండియా జెర్సీలో వైభవ్ సూర్యవంశీ..? బీసీసీఐ కార్యదర్శి ఏమన్నారంటే..!

India US Trade Deal | భారత్-అమెరికా మెగా ట్రేడ్ డీల్ రెడీ: 99 శాతం చర్చలు పూర్తి.. త్వరలోనే గుడ్‌న్యూస్

Rashmika Mandanna | రష్మిక తగ్గేదేలే ... బాలీవుడ్ సినిమాకు నేషనల్ క్రష్ రెమ్యూనరేషన్ చూస్తే మైండ్ బ్లాకే!

Traffic Restrictions | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రేపు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!






