త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ATA | ఆటా తెలుగు మ‌హాస‌భ‌ల‌కు రండి.. కేటీఆర్‌కు ఆహ్వానం

ATA | అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మ‌హాస‌భ‌ల‌కు హాజ‌రుకావాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)ను ఆహ్వానించిన‌ట్లు ఆటా అధ్య‌క్షుడు జ‌యంత్ చ‌ల్లా తెలిపారు. జూలై 31, ఆగ‌స్టు 1, 2 తేదీల్లో ఆటా తెలుగు మ‌హాస‌భ‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

S

Telangana | Published On May 30, 2026, 5.55 pm IST

ATA | ఆటా తెలుగు మ‌హాస‌భ‌ల‌కు రండి.. కేటీఆర్‌కు ఆహ్వానం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మ‌హాస‌భ‌ల‌కు హాజ‌రుకావాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)ను ఆహ్వానించిన‌ట్లు ఆటా అధ్య‌క్షుడు జ‌యంత్ చ‌ల్లా తెలిపారు. ఈ మేర‌కు కేటీఆర్‌ను శ‌నివారం క‌లిసిన‌ట్లు చెప్పారు. జూలై 31, ఆగ‌స్టు 1, 2 తేదీల్లో ఆటా తెలుగు మ‌హాస‌భ‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా అమెరికాలోని భార‌తీయుల ప‌రిస్థితులు, రాజ‌కీయాల‌పై చ‌ర్చించామ‌న్నారు.

అమెరికా మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభల‌ సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను కేటీఆర్ కు వివరించారు. ఈ మహా సభలకు హాజరయ్యేందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించిన‌ట్లు జయంత్ చల్లా, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల చెప్పారు. జ‌యంత్ చ‌ల్లా, శ‌ర‌త్ వేముల‌, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా కేటీఆర్‌ను క‌లిసిన వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement