Pawan Kalyan | ప్రెస్ మీట్‌కైనా అనుమతిస్తారా..? పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్
Pawan Kalyan | జనసేన పార్టీ (JanaSena Party) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నేడు ఆసక్తికర పోస్టు పెట్టారు. ఈరోజు సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Pawan Kalyan | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ (Hyderabad)లో జనసేన పార్టీ (JanaSena Party) నిర్వహించ తలపెట్టిన సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నేడు ఆసక్తికర పోస్టు పెట్టారు. ఈరోజు సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
జనసేన పార్టీ (JSP) నాయకులతో కలిసి ఇవాళ సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెడుతున్నట్లు పవన్ ప్రకటించారు. ఈ ప్రెస్‌మీట్‌కైనా పోలీసులు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అంటూ ఎక్స్ వేదికగా పవన్ పోస్టు పెట్టారు.
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
— Pawan Kalyan (@PawanKalyan) June 2, 2026
పవన్ సభకు అనుమతి నిరాకరణ..!
తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరిట గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్‌లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు భారీ కార్యక్రమం నిర్వహించాలని జనసేన ఏర్పాట్లు చేసింది. ఈ సభకు పవన్ కల్యాణ్ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సభకు అనుమతి రాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read..
వేసవికి నేటితో ముగింపు.. రేపటి నుంచి తెలంగాణలో వర్షాలే వర్షాలు
విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకుందాం.. కేటీఆర్ పిలుపు
దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
సంబంధిత వార్తలు

Kodandaram | పవన్ కళ్యాణ్ అనవసర వివాదాలకు తెరలేపుతున్నరు: కోదండరాం
జూన్ 2, 2026

Telangana Formation Day Celebrations | పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు .. LIVE
జూన్ 2, 2026

Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు తెలంగాణ పోలీసుల షాక్.. సభకు అనుమతి నిరాకరణ..!
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●Telangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోదు.. హక్కుల కోసం రాజీపడదు : స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గందె
- ●BRS South Africa | ప్రతి బిడ్డా గర్వంగా చెప్పుకొనే దినం.. జూన్ 2: నాగరాజు గుర్రాల
- ●Indian truck drivers | అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్లు అరెస్టు
- ●Kodandaram | పవన్ కళ్యాణ్ అనవసర వివాదాలకు తెరలేపుతున్నరు: కోదండరాం
- ●Summer | వేసవికి నేటితో ముగింపు.. రేపటి నుంచి తెలంగాణలో వర్షాలే వర్షాలు
- ●KTR | విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకుందాం.. కేటీఆర్ పిలుపు

Telangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోదు.. హక్కుల కోసం రాజీపడదు : స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గందె

BRS South Africa | ప్రతి బిడ్డా గర్వంగా చెప్పుకొనే దినం.. జూన్ 2: నాగరాజు గుర్రాల

Indian truck drivers | అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్లు అరెస్టు

Kodandaram | పవన్ కళ్యాణ్ అనవసర వివాదాలకు తెరలేపుతున్నరు: కోదండరాం



