త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు.. హైద‌రాబాద్‌లో ఈ రాత్రికి భారీ వ‌ర్షం..

Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు( Temperatures ) న‌మోద‌వుతున్నాయి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా( Mahabubnagar District )లో ఆదివారం అత్య‌ల్పంగా 22.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది.

S

Hyderabad | Published On Jun 28, 2026, 3.27 pm IST

Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు.. హైద‌రాబాద్‌లో ఈ రాత్రికి భారీ వ‌ర్షం..
Advertisement

Rain Alert | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు( Temperatures ) న‌మోద‌వుతున్నాయి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా( Mahabubnagar District )లో ఆదివారం అత్య‌ల్పంగా 22.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ( TDPS ) వెద‌ర్ డేటా ప్ర‌కారం.. 28 జిల్లాల్లో 25 డిగ్రీల కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి.

గ్రేట‌ర్ హైద‌రాబాద్( Greater Hyderabad ) ప‌రిధిలో ప‌రిశీలిస్తే.. శేరిలింగంప‌ల్లిలో అత్య‌ల్పంగా 24.7 డిగ్రీలు, రాజేంద్ర‌న‌గ‌ర్‌, మూసాపేట‌, యూసుఫ్‌గూడ‌లో 24.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యాయి. ఇక పెద్ద‌ప‌ల్లి జిల్లా క‌మాన్‌పూర్‌లో అత్య‌ధికంగా 38.6 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త నమోదైంది. హైద‌రాబాద్ న‌గ‌రంలోని బేగంపేట‌లో 35.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది.

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆకాశం మేఘావృత‌మైంద‌ని, సాయంత్రం నుంచి రాత్రి వ‌ర‌కు ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు. శేరిలింగంప‌ల్లి, మియాపూర్, ఆర్సీపురం, శంషాబాద్, మొయినాబాద్, నిజాంపేట్‌తో పాటు ఆ స‌మీప ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు.

Advertisement
Advertisement