త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Riyadh Airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై క్షిప‌ణి దాడి.. పైల‌ట్‌ స‌హా 12 మంది మృతి

Riyadh Airport | సౌదీ అరేబియాపై (Saudi Arabia) యెమెన్‌కు చెందిన తిరుగుబాటుదారులు హౌతీలు (Houthi) మ‌రోసారి దాడికి పాల్ప‌డ్డారు. రాజధాని రియాద్‌లోని (Riyadh Airport) కింగ్ ఖ‌లీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిప‌ణి దాడి జ‌రిపారు.

G

International | Published On Oct 11, 2026, 7.20 am IST

Riyadh Airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై క్షిప‌ణి దాడి.. పైల‌ట్‌ స‌హా 12 మంది మృతి
Advertisement

Riyadh Airport | త్రినేత్ర న్యూస్‌: సౌదీ అరేబియాపై (Saudi Arabia) యెమెన్‌కు చెందిన తిరుగుబాటుదారులు హౌతీలు (Houthi) మ‌రోసారి దాడికి పాల్ప‌డ్డారు. రాజధాని రియాద్‌లోని (Riyadh Airport) కింగ్ ఖ‌లీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిప‌ణి దాడి జ‌రిపారు. దీంతో పైల‌ట్ స‌హా 12 మంది మ‌ర‌ణించారు. మ‌రో 309 మంది గాయ‌ప‌డ్డారు. హౌతీల మెరుపుదాడితో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఎయిర్‌పోర్టు కార్య‌క‌లాపాల‌ను నిలిపివేశారు. ప్ర‌యాణికుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. రియాద్‌కు రావాల్సిన దేశీయ, అంతర్జాతీయ విమానాలను ఇత‌ర‌ ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. మృతుల్లో న‌లుగురు సౌదీ జాతీయులు ఉండ‌గా, ఇద్ద‌రు బంగ్లాదేశీయులు, అమెరికా, జోర్డాన్‌, పాల‌స్తీనా, సిరియా, సూడాన్‌, ఈజిప్ట్‌కు చెందిన వారు ఒక్కొక్క‌రు ఉన్నారని అధికారులు వెల్ల‌డించారు. గాయ‌ప‌డిన‌వారిని అంబులెన్సులు, హెలికాప్ట‌ర్ల‌లో దవాఖాన‌కు త‌ర‌లించామ‌న్నారు. క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెప్పారు.

ఎలాంటి ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు లేకుండానే క్షిప‌ణి దాడి జ‌ర‌గ‌గా, సౌదీ హెచ్చ‌రికల వ్య‌వ‌స్థ కూడా ప‌నిచేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కాగా, కింగ్ ఖ‌లీద్ ఎయిర్‌పోర్టుపై (King Khalid International Airport) దాడి జ‌ర‌గ‌డం వారం రోజుల వ్య‌వ‌ధిలో ఇది మూడోసారి. రెండు రోజుల క్రితం జరిగిన దాడిలో ఒక పైలట్‌తో సహా ముగ్గురు సౌదీ పౌరులు మరణించారు. మ‌రోవైపు రియాద్‌ విమానాశ్రయాన్ని మూసేశారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి వెల్లడించారు. యెమెన్‌ (Yemen) అంతర్యుద్ధంలో సౌదీ అరేబియా జోక్యం చేసుకోవ‌డంతో ఆ దేశంపై తిరుగుబాటుదారులు త‌ర‌చూ దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. సౌదీ రాజధానిపై ఇప్పటి వరకూ జరిగిన దాడులన్నిటికీ తమదే బాధ్యత అని హౌతీలు ప్రకటించారు. కాగా.. హౌతీ రెబల్స్‌పై సౌదీ చేస్తున్న దాడుల్లో అమెరికా కూడా పాలుపంచుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donal Trump) వెల్లడించారు. తాజా దాడుల గురించి తమకు సమాచారం అందిందని, దీనిపై చాలా వేగంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Advertisement
Advertisement