త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Saudi Airport | సౌదీ ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భార‌తీయుడు మృతి

Saudi Airport | సౌదీ అరేబియా (Saudi Arabia)లోని దమ్మామ్‌లో గ‌ల కింగ్‌ ఫహాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుపై (Dammam airport) హౌతీ రెబల్స్ (Houthis) దాడికి తెగ‌బడ్డారు. ఈ దాడిలో భార‌తీయుడు స‌హా ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారు.

D

International | Published On Oct 22, 2026, 3.26 pm IST

Saudi Airport | సౌదీ ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భార‌తీయుడు మృతి
Advertisement

Saudi Airport | త్రినేత్ర న్యూస్ : సౌదీ అరేబియా (Saudi Arabia)పై హౌతీ రెబల్స్ (Houthis) దాడులు ఆగడం లేదు. సౌదీలోని ప్రధాన విమానాశ్రయాలపై వరుస దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా దమ్మామ్‌లోని కింగ్‌ ఫహాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుపై (Dammam airport) క్షిపణులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో భార‌తీయుడు స‌హా ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారు. బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దాడి కారణంగా విమానాశ్రయం తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ట్లు సౌదీ అధికారులు తెలిపారు.

మృతుల్లో ఒక భార‌తీయుడు ఉన్న‌ట్లు రియాద్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ తెలిపింది. నిన్న రాత్రి దమ్మామ్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో దురదృష్టవశాత్తు ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా వారిలో ఒక భారతీయుడు ఉన్న‌ట్లు సౌదీ అధికారులు త‌మ‌కు స‌మాచారం ఇచ్చార‌ని వెల్ల‌డించింది. మ‌రో ఇద్ద‌రు భార‌తీయులు గాయ‌ప‌డిన‌ట్లు పేర్కొంది. ఈ మేర‌కు మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేసింది. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించింది. కాగా, ఈనెల‌లో సౌదీ విమానాశ్ర‌యాల‌పై జ‌రిగిన దాడుల్లో మొత్తం 22 మంది మ‌ర‌ణ‌ఙంచిన‌ట్లు ఏఎఫ్‌పీ అధికారిక గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. మ‌రోవైపు సౌదీపై దాడుల‌ను భార‌త్ తీవ్రంగా ఖండించింది. పౌర, ఇంధ‌న మౌలిక స‌దుపాయాల‌పై దాడులు ఏమాత్రం ఆమోద‌యోగం కాద‌ని పేర్కొంది.

Also Read..

కాంగ్రెస్ పార్టీ 2030 నాటి ఎన్నిక‌ల్లోనూ గెల‌వ‌లేదు : అమిత్ షా

భారత్‌తో పోలాండ్ కీలక డీల్.. ఈ 3 రంగాల్లో ఇక తిరుగుండదు!

వేతనం పెరిగిన కొద్దీ ఏటా 10 శాతం ఎస్ఐపీ పెంచాలా..?

Advertisement
Advertisement