త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold | బాతు క‌డుపులో 10 గ్రాముల బంగారం.. షాకైన య‌జ‌మాని

Gold | ప్రపంచ వ్యాప్తంగా ప‌సిడికి భారీగా డిమాండ్ ఉన్న నేప‌థ్యంలో.. ఓ బాతు క‌డుపులో బంగారం ప్ర‌త్య‌క్ష‌మైంది. బాతు క‌డుపులో బంగారం ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇది అక్ష‌రాలా నిజం.

S

International | Published On Mar 9, 2026, 3.23 pm IST

Gold | బాతు క‌డుపులో 10 గ్రాముల బంగారం.. షాకైన య‌జ‌మాని
Advertisement

Gold | త్రినేత్ర‌.న్యూస్ : ప్రపంచ వ్యాప్తంగా ప‌సిడికి భారీగా డిమాండ్ ఉన్న నేప‌థ్యంలో.. ఓ బాతు క‌డుపులో బంగారం ప్ర‌త్య‌క్ష‌మైంది. బాతు క‌డుపులో బంగారం ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇది అక్ష‌రాలా నిజం. బాతు క‌డుపులో ప్ర‌త్య‌క్ష‌మైన 10 గ్రాముల బంగారాన్ని చూసి య‌జ‌మాని షాక‌య్యాడు. ఈ ఘ‌ట‌న చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని లొంగుయ్ దేశంలో వెలుగు చూసింది.

స్థానిక వ్య‌క్తి లియూ స్థానికంగా ఉన్న న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో బాతుల‌ను పెంచుతున్నాడు. అయితే గ‌త నెల‌లో ఓ బాతును కోసుకుని వండుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు. దాంతో బాతును కోయ‌గా.. దాని క‌డుపులో బంగారం ప్ర‌త్య‌క్ష‌మైంది. బంగారాన్ని కొల‌వ‌గా 10 గ్రాములుగా తేలింది. ఈ బంగారం విలువ రూ. 1,65,821గా ఉంది. అయితే మన‌షులు, జంతువులు బంగారం మింగితే అది జీర్ణం కాదు. ఈ క్ర‌మంలో బాతు క‌డుపులో బంగారు రేణువులు అలానే ఉండిపోయాయి.

లియూ క‌థ‌నం ప్ర‌కారం.. స్థానికంగా ఉన్న న‌దీ ప‌రివాహ‌క ప్రాంతం బంగారు నిక్షేపాల‌కు ప్ర‌సిద్ధి. అయితే బాతులు ఆహారం కోసం న‌ది ప‌రిస‌ర ప్రాంతాల్లో సంచ‌రిస్తాయ‌ని, దాంట్లో భాగంగానే బంగారం రేణువులను మింగి ఉండొచ్చ‌ని పేర్కొన్నాడు. 1970 నుంచి 1990 వ‌ర‌కు ఈ న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో బంగారం కోసం అన్వేషించారు. చైనా ప్ర‌భుత్వం చివ‌రికి ప్ర‌యివేటు బంగారం మైనింగ్ కార్య‌క‌లాపాల‌ను నిషేధించింది.

Advertisement
Advertisement