త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్‌..

Gandhi Jayanti | మ‌ద్యం, మాంసం ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్‌. శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 2) వైన్ షాపులు, మీట్ దుకాణాలు బంద్ కానున్నాయి. జాతిపిత మ‌హాత్మా గాంధీ జ‌యంతి (Gandhi Jayanti) సంద‌ర్భంగా శ‌క్ర‌వారం రోజున అన్ని రకాల జంతు వధశాలలు (Slaughterhouse), మాంసం, బీఫ్ విక్రయ దుకాణాలను మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ క‌మిష‌న‌ర‌ర్ ఆర్‌వీ క‌ర్ణ‌న్ ఆదేశాలు జారీ చేశారు.

G

Hyderabad | Published On Oct 1, 2026, 6.59 am IST

Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్‌..
Advertisement

Gandhi Jayanti | త్రినేత్ర న్యూస్‌: మ‌ద్యం, మాంసం ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్‌. శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 2) వైన్ షాపులు, మీట్ దుకాణాలు బంద్ కానున్నాయి. జాతిపిత మ‌హాత్మా గాంధీ జ‌యంతి (Gandhi Jayanti) సంద‌ర్భంగా శ‌క్ర‌వారం రోజున అన్ని రకాల జంతు వధశాలలు (Slaughterhouse), మాంసం, బీఫ్ విక్రయ దుకాణాలను మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ క‌మిష‌న‌ర‌ర్ ఆర్‌వీ క‌ర్ణ‌న్ ఆదేశాలు జారీ చేశారు. గాంధీజీ అహింసా సిద్ధాంతాలు, ఆయన విశిష్టతను గౌరవిస్తూ జీహెచ్‌ఎంసీ (GHMC) స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్ల‌డించారు. జీహెచ్‌ఎంసీ చట్టం, 1955లోని సెక్షన్ 533(బి) కింద ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మేకలు, గొర్రెలు, పశువుల వధశాలలతో పాటు నగరవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ చికెన్, మటన్, బీఫ్ షాపులు మూతపడనున్నాయి.

ఈ నిబంధనలు కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని పోలీసుల‌తోపాటు మున్సిప‌ల్‌ అధికారుల‌కు సూచించారు. హైదరాబాద్, సైబరాబాద్, మ‌ల్కాజిగిరి పోలీస్ కమిషనర్లకు లేఖలు రాస్తూ, పశువధ శాలలు, మాంసం దుకాణాలు తెరిచి ఉంచకుండా చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ అధికారులకు అవసరమైన పోలీసు బందోబస్తు, సహకారం అందించాలన్నారు. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా మాంసం విక్రయించినా, జంతువధకు పాల్పడినా వారిపై నిబంధనల ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మ‌ద్యం దుకాణాలు కూడా..

అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా డ్రై డే (Dry Day) అమలులో ఉంటుంది. గాంధీజీ సిద్ధాంతాలను గౌరవిస్తూ ప్రతీ ఏడాది అక్టోబ‌ర్ 2న మద్యం అమ్మకాలను (Wine Shop Closed) నిషేధిస్తారు. వైన్ షాపులతో పాటుగా రెస్టారెంట్ బార్లు, పబ్‌లు, స్టార్ హోటళ్లు, డిస్ట్రిబ్యూటర్ సెంటర్లలో కూడా మద్యం విక్రయాలు నిలిచిపోనున్నాయి. అక్రమంగా మద్యం విక్రయించినా, నిల్వ చేసినా వారిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తారు.

Advertisement
Advertisement