KP Vivekananda | భగీరథ్ అరెస్టుపై కాలయాపనెందుకు?: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
KP Vivekananda | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bhagirath) పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay) , రాష్ట్ర హోం శాఖను దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) కుమ్మక్కై కేసును నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
- బండి సంజయ్ రాజీనామా చేయాలి
- సంజయ్‌ని కాపాడేందుకు రేవంత్‌రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నడు
- రేవంత్ తో బండివి చీకటి ఒప్పందాలు
- కాంగ్రెస్, బీజేపీపై ఎమ్మెల్యే వివేకానంద ఫైర్
KP Vivekananda | త్రినేత్ర.న్యూస్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bhagirath) పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay) , రాష్ట్ర హోం శాఖను దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) కుమ్మక్కై కేసును నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి..
బాధిత బాలికకు న్యాయం చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆగ్రహించారు. బండి సంజయ్ కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో బాధిత కుటుంబ సభ్యుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని వివేకానంద స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. భగీరథ్‌పై కేసు నమోదై మూడు రోజులు దాటుతున్నా ఇంకా అరెస్టు చేయకపోవడం దుర్మాగం. రేవంత్‌రెడ్డి నిందితుడిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నడు. రామ మందిరం పేరు చెప్పి మాట్లాడే వ్యక్తి బండి సంజయ్‌కి కోట్ల రూపాయలు ఎట్లొచ్చినయ్. 2018 కి ముందు ఎట్లున్నవ్. ఇప్పుడు ఎట్లున్నవ్. మొసలి కన్నీరు కాదు. దేవుడు పేరు, ధర్మం పేరు చెప్పడం కాదు. వెంటనే రాజీనామా చెయ్. బండి సంజయ్‌కి సొంత బలం లేదు. దేవుళ్లకు దండం పెట్టి గెలిచినవ్. నీ రాజకీయ చరిత్ర అందరికీ తెలుసు.
బీజేపీని, నీ ధర్మాన్ని తాకట్టు పెట్టినవ్..
బీజేపీని, నీ ధర్మాన్ని రేవంత్‌రెడ్డికి తాకట్టు పెట్టినవ్. రేవంత్‌తో చీకటి ఒప్పందాలు చేసుకున్నవ్. చీకటి వ్యాపారాలు చేసుకుంటా మొసలి కన్నీరు ఎందుకు? వాస్తవం ప్రజలకు తెలుస్తది. ఎలక్షన్ల ముందు నాకేం లేదని చెప్పాడు. కరీనగర్ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఎట్ల ఖర్చు పెట్టినవ్? నువ్ నీ పదవికి రాజీనామా చేస్తే దోషివో, నిర్దోషివో తెలుతది అని వివేకానంద అన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



