త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Water Supply | హైద‌రాబాద్ న‌గ‌రంలో 36 గంట‌ల పాటు నీటి స‌ర‌ఫ‌రా బంద్

Water Supply | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రోసారి నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది. జ‌న‌వ‌రి 10 ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు నీటి స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్న‌ట్లు జ‌ల మండ‌లి అధికారులు ప్ర‌క‌టించారు.

S

Hyderabad | Published On Jan 8, 2026, 9.08 pm IST

Water Supply | హైద‌రాబాద్ న‌గ‌రంలో 36 గంట‌ల పాటు నీటి స‌ర‌ఫ‌రా బంద్
Advertisement

Water Supply | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రోసారి నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది. జ‌న‌వ‌రి 10 ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు నీటి స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్న‌ట్లు జ‌ల మండ‌లి అధికారులు ప్ర‌క‌టించారు.

నీటి స‌ర‌ఫ‌రా బంద్ ఎక్క‌డంటే..?

వ‌నస్థ‌లిపురం, ఆటోన‌గ‌ర్, వైశాలి న‌గ‌ర్, నాగోల్, బ‌డంగ్‌పేట్, లెనిన్ న‌గ‌ర్, ఆదిభ‌ట్ల‌, బ‌ర్కాస్, మైసారం, నాచారం, తార్నాక‌, బుద్ధ న‌గ‌ర్, న‌ల్ల‌గుట్ట‌, లాల‌పేట్‌, మారెడ్‌ప‌ల్లి, ప్ర‌కాశ్ న‌గ‌ర్, పాటిగ‌డ్డ‌, మేక‌ల‌మండి, కంటోన్మెంట్, హ‌స్మ‌త్‌పేట్‌, గౌతం న‌గ‌ర్, ఫీరోజ్‌గూడ‌, మ‌ధుబ‌న్ రిజ‌ర్వాయ‌ర్, శాస్త్రిపురం, ప్ర‌శాన్ న‌గ‌ర్, నేష‌న‌ల్ పోలీసు అకాడ‌మీ ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది.

కృష్ణా పైపు లైన్ల మ‌ర‌మ్మ‌తు, లీకేజీల కార‌ణంగా 36 గంట‌ల పాటు నీటి స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు స్ప‌ష్టం చేశారు. నాస‌ర్ల‌ప‌ల్లి వ‌ద్ద జంక్ష‌న్ ప‌నులు కూడా ఒక కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో న‌గ‌ర ప్ర‌జ‌లు తాగునీటిని జాగ్ర‌త్త‌గా వినియోగించాల‌ని సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement