Stock Market | స్టాక్ మార్కెట్లు క్రాష్.. రూ.13లక్షల కోట్ల సంపద ఆవిరైంది..
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. మెజారిటీ రంగాల్లో అమ్మకాలతో వరుసగా ఐదో సెషన్‌లో భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 0.72శాతం పతనమై 605 పాయింట్లు తగ్గి 83,576 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 194 పాయింట్లు తగ్గి 25,683 వద్ద స్థిరపడింది. వరుస నష్టాలతో రూ.13లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. మెజారిటీ రంగాల్లో అమ్మకాలతో వరుసగా ఐదో సెషన్‌లో భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 0.72శాతం పతనమై 605 పాయింట్లు తగ్గి 83,576 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 194 పాయింట్లు తగ్గి 25,683 వద్ద స్థిరపడింది. వరుస నష్టాలతో రూ.13లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
అమెరికా సుంకాల ఎఫెక్ట్..
బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లోకి జారుకోవడంతో విస్తృత మార్కెట్‌పై ఒత్తిడికి గురైంది. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునే దేశాలపై అమెరికా వాణిజ్య చర్యలు తీసుకునే అవకాశం పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలతో మార్కెట్‌లో అమ్మకాలకు దారి తీశాయి. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యన్ చమురును భారత్, చైనా, బ్రెజిల్ సహా పలు దేశాలు చమురు కొనుగోలు కొనసాగిస్తుండడంతో సుంకాలను మరింత పెంచే బిల్లును ట్రంప్ ఆమోదించినట్లుగా యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రహం పేర్కొన్నారు. వచ్చేవారం ప్రారంభంలో భారత్, చైనాపై సుంకాలు 500శాతం వరకు పెరిగే అవకాశం ఉందని గ్రహం తెలిపారు.
రూ.13లక్షల కోట్లు సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు
వరుసగా ఐదురోజుల్లో మార్కెట్లు పతనమవుతున్నాయి. ఈ క్రమంలో రూ.13లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరయ్యింది. మునుపటి సెషన్‌లో రూ. 472.25 లక్షల కోట్ల నుంచి రూ. 4.38 లక్షల కోట్లు తగ్గి.. రూ. 467.87 లక్షల కోట్లకు చేరుకుంది. శుక్రవారం మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, జియో ఫైనాన్షియల్ నష్టాలను చవిచూశాయి. ఏషియన్ పేయింట్స్, ఓఎన్‌జీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్‌సీఎల్, టెక్నాలజీస్, ఎటర్నల్ లాభపడ్డాయి.
52వారాల కనిష్ట స్థాయికి..
బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.9 శాతం తగ్గగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.7శాతం పడిపోయింది. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్, గ్యాస్ మినహా అన్ని ఇతర సూచీలు ఆటో, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి నుంచి 2శాతం దిగజారాయి. బీఎస్ఈలో 329 స్టాక్‌లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరాయి. ఏసీసీ, ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్, బీఏఎస్ఎఫ్ ఇండియా, బాటా ఇండియా, బ్లూ జెట్ హెల్త్‌కేర్, కార్బోరండమ్ యూనివర్సల్, క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కోహన్స్ లైఫ్‌సైన్సెస్, సిమెన్స్ ఎనర్జీ ఇండియాతో సహా బీఎస్ఈ500 ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






