Ticket Rate Hikes | రాజాసాబ్‌కు షాకిచ్చిన హైకోర్టు – టికెట్ ధరల పెంపు మెమో కొట్టివేత
రాజాసాబ్ మేకర్స్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఇప్పటికే తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు రాక నష్టపోయిన మేకర్స్‌కు హైకోర్టు మరో షాకిచ్చింది. తెలంగాణలో టికెట్ ధరలను పెంచుతూ హోంశాఖ కార్యదర్శి ఇచ్చిన మోమోను కొట్టేసింది.
Entertainment | Published On Jan 9, 2026, 6.26 pm IST
Ticket Rate Hikes |రాజాసాబ్ నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు గట్టి షాకిచ్చింది. సినిమా టికెట్ ధరలను పెంచుతూ హోంశాఖ ఇచ్చిన మెమోను శుక్రవారం హైకోర్టు కొట్టేసింది. రాజాసాబ్ టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ విజయ్ గోపాల్ అనే లాయర్ హైకోర్టులో పిటీషన్ వేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా రాజాసాబ్ టికెట్ ధరల పెంచేందుకు అనుమతులు ఇచ్చారంటూ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. మోమో జారీ చేసే అధికారం హోం శాఖ కార్యదర్శికి లేదని అన్నారు. హైదరాబాద్‌లో సీపీ, జిల్లా స్థాయిలో కలెక్టర్లకు మాత్రమే టికెట్ రేట్ల పెంపుతో పాటు ప్రీమియర్ షోలకు అనుమతులు ఇవ్వాల్సి వుంటుందని విజయ్ గోపాల్ వాదించారు. ఆయన పిటీషన్‌పై విచారణ జరిపిన కోర్టు టికెట్ ధరల పెంచుతూ ఇచ్చిన మెమోను కొట్టేసింది. పాత ధరలకే టికెట్లను అమ్మాలని ఆదేశించింది.
హైకోర్టు ఆగ్రహం...
ఈ సందర్భంగా అధికారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ ధరలను పెంచేది లేదని సంబంధిత మంత్రి ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోరా...అయినా పదే పదే రేట్లు ఎంచుకు పెంచుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మారడం లేదు..తెలివిగా ఎందుకు మోమోలు జారీ చేస్తున్నారని ప్రశ్నించింది. మెమో ఇచ్చిన అధికారికి నిబంధనలు తెలియవా అంటూ మందలిచింది.
ఇప్పటికే తెలంగాణలో ప్రీమియర్స్‌కు అనుమతులు లభించకపోవడంతో నష్టపోయిన రాజాసాబ్ మేకర్స్‌కు హైకోర్టు తీర్పుతో మరో గట్టి దెబ్బ తగిలింది. టికెట్ రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతుల కోసం రాజాసాబ్ మేకర్స్ హోంశాఖ కార్యదర్శితో పాటు హైకోర్టును ఆశ్రయించారు. రేట్ల పెంపుకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రీమియర్స్‌కు మాత్రం అనుమతి ఇవ్వకుండా కేవలం టికెట్ రేట్లను పెంచుతూ గురువారం అర్ధరాత్రి జీవోను జారీ చేశారు. జనవరి 9 నుంచి 11 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో 105, మల్టీప్లెక్స్‌లో 132 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. జనవరి 12 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో 62, మల్టీప్లెక్స్‌లో 89 పెంచుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. ఈ లాభాల్లో ఇరవై శాతం ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Tripti Dimri | ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ – సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్న హాట్ బ్యూటీ
మే 21, 2026

TG High Court | బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు..!
మే 14, 2026

Rakul Preet Singh | ప్రభాస్ సినిమా నుంచి నన్ను తీసేశారు – రకుల్ కామెంట్స్…
మే 8, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



