Uppal Ring Road | ఉప్పల్ రింగ్‌రోడ్డులో రెండు వైపుల తెరచుకున్న వరంగల్ రహదారులు
Uppal Ring Road | ఉప్పల్ రింగ్ రోడ్డులో (Uppal Ring Road) వాహనదారులకు భారీ ఉపశమనం లభించింది. మూడు నెలలుగా మూసివేసి ఉన్న వరంగల్ వైపు వెళ్లే, అటునుంచి వచ్చే రోడ్డు (Warangal Road) తెరచుకుంది.
Uppal Ring Road | త్రినేత్ర.న్యూస్: ఉప్పల్ రింగ్ రోడ్డులో (Uppal Ring Road) వాహనదారులకు భారీ ఉపశమనం లభించింది. మూడు నెలలుగా మూసివేసి ఉన్న వరంగల్ వైపు వెళ్లే, అటునుంచి వచ్చే రోడ్డు (Warangal Road) తెరచుకుంది. నెల రోజుల క్రితమే ఉప్పల్ రింగ్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రహదారిని అధికారులు తెరిచిన విషయం తెలిసిందే. తాజాగా వరంగల్ వైపు నుంచి వచ్చే మార్గంలోనూ వాహనాలకు అనుమతిస్తున్నారు. దీంతో ఉప్పల్ రింగు రోడ్డులో వాహనదారులతోపాటు ప్రయాణికుల కష్టాలు తీరినట్లయింది.

రామంతాపూర్ నుంచి నారపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ (Elevated Corridor) పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డులో వరంగల్ వైపు రెండు మార్గాలను అధికారులు మూసివేశారు. అయితే పిల్లర్ల నిర్మాణం (Pillar Construction) పూర్తి కాకపోయినప్పటికీ వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దారులను తెరచారు. కాగా, ఈ ఏడాది మే 17న ఉప్పల్ రింగ్ రోడ్డులో వరంగల్ వైపు వెళ్లే రహదారిని మూసివేశారు. దీంతో వాహనాలను జీఎస్‌ఐ, బీరప్పగడ్డ, ఉప్పల్ భగాయత్, ఓఆర్‌ఆర్ మార్గాలకు మళ్లించారు. ఉప్పల్, యాదగిరిగుట్ట బస్టాప్‌లను నల్లచెరువు కట్టకు మార్చారు. నగరం నుంచి వెళ్లే, వచ్చే వాహనాలను కూడా దారి మళ్లించారు. దీంతో చుట్టూ తిరిగిరావాల్సి వస్తుండటంతో వాహనదారులు ఇన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా ఆ కష్టాలకు పుల్‌స్టాప్ పడింది. అయితే ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో మరోసారి రింగ్ రోడ్డులో రహదారిని మూసివేసే అవకాశం లేకపోలేదు.
తాజావార్తలు
- ●Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా
- ●Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!
- ●Nagarjuna | పర్యావరణ హితం కోసం సీడ్ గణేషుడినే పూజించండి - అక్కినేని నాగార్జున పిలుపు
- ●TRS | టీఆర్ఎస్లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి.. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ
- ●Sirikonda Madhusudanachary | ఆరు రోజుల్లో ఏ ఒక్క షార్ట్ డిస్కషన్ సరిగా జరగలే
- ●BRICS Summit New Delhi | బ్రిక్స్ సదస్సులో భారత్ దౌత్య విజయం: పుతిన్, జిన్‌పింగ్‌ల మధ్య మోదీ.. 'న్యూఢిల్లీ డిక్లరేషన్'కు సర్వసమ్మతి

Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా

Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!

Nagarjuna | పర్యావరణ హితం కోసం సీడ్ గణేషుడినే పూజించండి - అక్కినేని నాగార్జున పిలుపు

TRS | టీఆర్ఎస్లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి.. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ






