Uppal Junction | ఉప్పల్ చౌరస్తా బంద్.. వాహనదారులు ఎలా వెళ్లాలంటే?
Uppal Junction | నిత్యం రద్దీగా ఉంటే ఉప్పల్ జంక్షన్‌ను (Uppal Junction) అధికారులు మూసివేశారు. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ (elevated corridor) పనులు జరుగుతుండటంతో ఉప్పల్ చౌరస్తాను మూసివేశారు.
Uppal Junction | త్రినేత్ర.న్యూస్: నిత్యం రద్దీగా ఉంటే ఉప్పల్ జంక్షన్‌ను (Uppal Junction) అధికారులు మూసివేశారు. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ (elevated corridor) పనులు జరుగుతుండటంతో ఉప్పల్ చౌరస్తాను మూసివేశారు. విద్యుత్ జంక్షన్ సమీపంలో పనులు జరుగుతుండటంతో రింగ్‌రోడ్డు నుంచి వరంగల్ వైపు వెళ్లే రహదారిని తాత్కాలింగా బంద్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనా హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లాపూర్, ఐఓసీ, చెంగిచర్ల మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాలని సూచించారు.
అదేవిధంగా చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరాగాంధీ పార్కు నుంచి లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనక నుంచి వరంగల్ రహదారికి చేరుకోవచ్చు. ఇక బోడుప్పల్ నుంచి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద భగాయత్ లే అవుట్ నుంచి నాగోల్ రోడ్డు.. ద్విచక్ర వాహనదారులు నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్లు 812, 813 నుంచి ఉప్పల్ వైపు, భారీ వాహనాలు నాగోల్ బ్రిడ్జి కిందుగా యూ టర్న్ తీసుకుని ఉప్పల్ వైపు రావాల్సి ఉంటుంది.
ఉప్పల్ చౌరస్తా మూసివేతతో.. వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట బస్ట్ స్టాప్‌ను నల్ల చెరువు కట్ట సమీపానికి తరలించారు. ఈ నేపేథ్యంలో ఆయా రూట్లలో వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు నల్లచెరువు వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sai Pallavi | రామాయణ నుంచి ఎట్టకేలకు సాయిపల్లవి పోస్టర్ రిలీజ్ - ప్రమోషన్స్ షురూ
- ●Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. పెట్టుబడిదారులకు నిపుణల అలర్ట్..
- ●Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. రేపు బ్లడ్ బాత్ తప్పదా..?
- ●Brahmotsavalu 2026 | బ్రహ్మోత్సవాల వెనుక కనిపించని వేల చేతులు..!
- ●Vinayaka chavithi 2026 | వినాయకుడి వైభవం చూడాల్సిందే.. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాలు ఇవే..!
- ●Gurugram Woman Biker Hit By Car | భయానక ఘటన: తనను వెంబడించొద్దన్నందుకు మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి.. వీడియో వైరల్

Sai Pallavi | రామాయణ నుంచి ఎట్టకేలకు సాయిపల్లవి పోస్టర్ రిలీజ్ - ప్రమోషన్స్ షురూ

Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. పెట్టుబడిదారులకు నిపుణల అలర్ట్..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. రేపు బ్లడ్ బాత్ తప్పదా..?

Brahmotsavalu 2026 | బ్రహ్మోత్సవాల వెనుక కనిపించని వేల చేతులు..!






