Uppal Ring Road | ఉప్పల్ రింగ్ రోడ్డు 3 నెలలు మూసివేత.. ప్రత్యామ్నాయ రహదారులు ఇవే..!
Uppal Ring Road | హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ రింగ్ రోడ్డు మూడు నెలల పాటు మూసివేయనున్నారు. ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల దృష్ట్యా ఉప్పల్ రింగ్ రోడ్డు మూసివేయనున్నట్లు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
Uppal Ring Road | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ రింగ్ రోడ్డు మూడు నెలల పాటు మూసివేయనున్నారు. ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల దృష్ట్యా ఉప్పల్ రింగ్ రోడ్డు మూసివేయనున్నట్లు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డును మూడు నెలల పాటు మూసివేయనున్నారు. అయితే ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా వరంగల్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఈ క్రమంలో వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట బస్సులను నల్లచెరువు కట్ట వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాప్‌కు మళ్లించారు. ఆ జిల్లాల నుంచి వచ్చే బస్సులను చెరువు కట్ట వరకే పరిమితం చేస్తున్నారు. ఈ మార్గంలో వచ్చే బస్సులు జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు సిటీలోకి వచ్చే బస్సులు, ఇతర వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
వరంగల్ టూ హైదరాబాద్..
వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనదారులు.. మేఫిల్ హోటల్ దాటిన తర్వాత ఉప్పల్ భగాయత్ మీదుగా నాగోల్ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ్నుంచి సర్వీస్ రోడ్డు మీదుగా ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకోవాలి.
హైదరాబాద్ టూ వరంగల్..
హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనదారులు సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ వద్ద పిస్తా హౌస్ పక్క నుంచి బీరప్ప గడ్డ మీదుగా వెళ్లి ఎన్‌హెచ్-163 మీదుగా వరంగల్ వెళ్లొచ్చని సూచించింది.
ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలకు దారి ఇలా..
ఉప్పల్ భగాయత్ రహదారి ఇరుకుగా ఉన్నందున హైదరాబాద్ వచ్చే వరంగల్ బస్సులు, లారీలు పెద్ద వాహనాలను ఓఆర్ఆర్ నుంచి హయత్‌నగర్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలని, హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనదారులు ఎల్బీనగర్, హయత్‌నగర్ ఓఆర్ఆర్ మీదుగా ఘట్‌కేసర్ నుంచి వరంగల్ వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- ●Sai Pallavi | రామాయణ నుంచి ఎట్టకేలకు సాయిపల్లవి పోస్టర్ రిలీజ్ - ప్రమోషన్స్ షురూ
- ●Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. పెట్టుబడిదారులకు నిపుణల అలర్ట్..
- ●Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. రేపు బ్లడ్ బాత్ తప్పదా..?
- ●Brahmotsavalu 2026 | బ్రహ్మోత్సవాల వెనుక కనిపించని వేల చేతులు..!
- ●Vinayaka chavithi 2026 | వినాయకుడి వైభవం చూడాల్సిందే.. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాలు ఇవే..!
- ●Gurugram Woman Biker Hit By Car | భయానక ఘటన: తనను వెంబడించొద్దన్నందుకు మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి.. వీడియో వైరల్

Sai Pallavi | రామాయణ నుంచి ఎట్టకేలకు సాయిపల్లవి పోస్టర్ రిలీజ్ - ప్రమోషన్స్ షురూ

Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. పెట్టుబడిదారులకు నిపుణల అలర్ట్..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. రేపు బ్లడ్ బాత్ తప్పదా..?

Brahmotsavalu 2026 | బ్రహ్మోత్సవాల వెనుక కనిపించని వేల చేతులు..!






