Uppal Elevated Corridor | ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌కు మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు
Uppal Elevated Corridor | హైదరాబాద్‌లోని ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మితమవుతున్న ఎలివేటెడ్ కారిడార్ (Uppal-Narapally Flyover) పేరును ప్రభుత్వం మార్పు చేసింది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత బండారి రాజిరెడ్డి (Bandari Rajireddy) పేరు మీదుగా ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కారిడార్‌గా మార్చింది.
Uppal Elevated Corridor | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మితమవుతున్న ఎలివేటెడ్ కారిడార్ (Uppal-Narapally Flyover) పేరును ప్రభుత్వం మార్పు చేసింది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత బండారి రాజిరెడ్డి (Bandari Rajireddy) పేరు మీదుగా ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కారిడార్‌గా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ జీవో విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో దాదాపు 50 ఏండ్ల అనుబంధం ఉందని తెలిపారు. తమ తల్లి మల్లాపూర్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ తరఫున వార్డు సభ్యురాలిగా ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. తమ అన్నగారు కీర్తిశేషులు బండారి రాజిరెడ్డి కాప్రా మున్సిపల్ చైర్మన్‌గా, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా (2009-14), అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ తరఫున (2012-14) సేవలందించారని తెలిపారు. 2019లో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయం కోసం బండారి రాజిరెడ్డి అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు.
ఉప్పల్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు గాను.. రామంతాపూర్ నుంచి నారపల్లి వరకు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2017లో దీనికి శంకుస్థాపన జరగగా.. 2018లో పనులు ప్రారంభమయ్యాయి. అయితే, మధ్యలో కొన్ని డిజైన్ మార్పుల్లు, కరోనా కారణంగా పనులు నిలిచిపోయాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి కొత్త కారిడార్‌ను విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి రామంతాపూర్ వైపు మరో 200 మీటర్ల మేర పొడిగిస్తున్నారు. ఈ పొడిగింపు వంతెనను జీహెచ్ఎంసీ నిర్మిస్తున్నది. ఇక నారపల్లి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న 8 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్‌ను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (NHAI) పర్యవేక్షణలోని ఆర్ అండ్ బీ విభాగం నిర్మాణ పనులు చేపట్టింది. కాగా, ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న స్కైవాక్, మెట్రో కారిడార్ల మీదుగా వంతెనను నిర్మించాల్సి ఉంది. దీని కారణంగా వంతెనను సాధారణ ఎత్తు 5.5 మీటర్ల కంటే దాదాపు రెండింతలు ఎక్కువగా, అంటే 13 మీటర్ల ఎత్తులో నిర్మిస్తారు.
సంబంధిత వార్తలు

Traffic Restrictions | హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారిమళ్లింపు
మే 6, 2026

Uppal Junction | ఉప్పల్ చౌరస్తా బంద్.. వాహనదారులు ఎలా వెళ్లాలంటే?
ఏప్రిల్ 26, 2026

Traffic Restrictions | నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. మధ్యాహ్నం 12 తర్వాత అటువైపు వెళ్లారో ఇక అంతే!
ఏప్రిల్ 13, 2026
తాజావార్తలు
- ●Web Series Review | మేము కాప్‌లం వెబ్‌సిరీస్ రివ్యూ - కోడి దొంగ కోసం పోలీసుల ఇన్వేస్టిగేషన్
- ●OTT Releases This Week | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన మలయాళ, తమిళ సినిమాలు ఇవే
- ●Minister Sridhar Babu | డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లో రోల్‌మాడల్‌గా తెలంగాణ : మంత్రి శ్రీధర్‌బాబు
- ●Vishnu Priya | నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు - యూట్యూబర్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విష్ణుప్రియ
- ●Komati Reddy | ప్రభుత్వ స్కూల్ టాపర్లకు మంత్రి కోమటిరెడ్డి సర్ప్రైజ్ గిఫ్ట్.. విమానంలో వైజాగ్ టూర్..!
- ●Venkateshwar Reddy, Narendar Reddy | హరీశ్‌రావు ఉన్నమాటే అన్నారు.. అవాకులు, చెవాకులెందుకు యెన్నం: మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి

Web Series Review | మేము కాప్‌లం వెబ్‌సిరీస్ రివ్యూ - కోడి దొంగ కోసం పోలీసుల ఇన్వేస్టిగేషన్

OTT Releases This Week | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన మలయాళ, తమిళ సినిమాలు ఇవే

Minister Sridhar Babu | డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లో రోల్‌మాడల్‌గా తెలంగాణ : మంత్రి శ్రీధర్‌బాబు

Vishnu Priya | నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు - యూట్యూబర్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విష్ణుప్రియ



