Vishnu Priya | నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు – యూట్యూబర్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విష్ణుప్రియ
ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ వివాదం కారణంగా కొద్ది రోజుల క్రితం విష్ణుప్రియ పేరు తెగ వైరల్ అయ్యింది. తాజాగా మరోమారు ఈ యాంకర్ వార్తల్లో నిలిచింది. తనపై తప్పుడు కథనాలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ ఓ యూట్యూబర్‌పై విష్ణుప్రియ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
Entertainment | Published On May 22, 2026, 7.08 pm IST
Vishnu Priya |యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో తనకు ఎదురవుతోన్న వేధింపులపై యాంకర్ విష్ణుప్రియ పోలీసులను ఆశ్రయించింది. ఓ యూట్యూబర్‌పై కంప్లైంట్ ఇచ్చింది. ప్లే లైక్ ఇంకాగ్నిటో అనే యూట్యూబ్ ఛానెల్‌లో తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని విష్ణుప్రియ అన్నది. ఇకపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలను సహించేది లేదని చెప్పింది.
వ్యూస్ పెంచుకోవడానికే...
"యూట్యూబ్‌లో వ్యూస్ సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడానికి కొందరు సెలిబ్రిటీల గురించి నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. వారి గురించి తప్పుడు సమాచారాన్ని ఆడియెన్స్‌కు చేరవేస్తూ హద్దులు దాటుతున్నారు. జనాలను ఎంటర్‌టైన్ చేయడానికే ఈ ఫీల్డ్‌కు వచ్చా. నిజంగా తప్పు చేస్తే ఎన్ని మాటలైనా భరిస్తాను. సహిస్తాను. కానీ తప్పుచేయకుండా నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తే ఊరుకోను. డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది అంటూ నీచమైన పదాలు వాడుతూ దిగజారుతున్నారు. ఇకపై ఇలాంటి నిందలు భరించను. చట్ట ప్రకారం బుద్ది చెప్పాలనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చా. నన్ను మాత్రమే కాకుండా ఇండస్ట్రీలోని ఏ ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నా. నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వీడియోలు, పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటా" అని విష్ణుప్రియ అన్నది.
బిగ్‌బాస్‌తో పాపులర్....
యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన విష్ణుప్రియ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8తో పాపులర్ అయ్యింది. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తుందని విష్ణుప్రియపై కేసు నమోదు అయ్యింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Satyadev | సమవర్తిగా సత్యదేవ్ – టాలీవుడ్‌కు కొత్త జానర్‌ను పరిచయం చేస్తోన్న హీరో
మే 22, 2026

Nivetha Pethuraj | వెంకటేష్ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ – మరోసారి ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్?
మే 22, 2026

Pooja Hegde | మళ్లీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా పూజా హెగ్డే.. ఇక కెరీర్ ట్రాక్‌లో పడినట్లేనా..?
మే 22, 2026
తాజావార్తలు
- ●OTT Releases This Week | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన మలయాళ, తమిళ సినిమాలు ఇవే
- ●Minister Sridhar Babu | డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లో రోల్‌మాడల్‌గా తెలంగాణ : మంత్రి శ్రీధర్‌బాబు
- ●Komati Reddy | ప్రభుత్వ స్కూల్ టాపర్లకు మంత్రి కోమటిరెడ్డి సర్ప్రైజ్ గిఫ్ట్.. విమానంలో వైజాగ్ టూర్..!
- ●Venkateshwar Reddy, Narendar Reddy | హరీశ్‌రావు ఉన్నమాటే అన్నారు.. అవాకులు, చెవాకులెందుకు యెన్నం: మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి
- ●Satyadev | సమవర్తిగా సత్యదేవ్ - టాలీవుడ్‌కు కొత్త జానర్‌ను పరిచయం చేస్తోన్న హీరో
- ●Vinesh Phogat | ఆసియా గేమ్స్ ట్రయల్స్ వివాదం.. రెజ్లింగ్ ఫెడరేషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం..

OTT Releases This Week | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన మలయాళ, తమిళ సినిమాలు ఇవే

Minister Sridhar Babu | డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లో రోల్‌మాడల్‌గా తెలంగాణ : మంత్రి శ్రీధర్‌బాబు

Komati Reddy | ప్రభుత్వ స్కూల్ టాపర్లకు మంత్రి కోమటిరెడ్డి సర్ప్రైజ్ గిఫ్ట్.. విమానంలో వైజాగ్ టూర్..!

Venkateshwar Reddy, Narendar Reddy | హరీశ్‌రావు ఉన్నమాటే అన్నారు.. అవాకులు, చెవాకులెందుకు యెన్నం: మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి



