Web Series Review | మేము కాప్‌లం వెబ్‌సిరీస్ రివ్యూ – కోడి దొంగ కోసం పోలీసుల ఇన్వేస్టిగేషన్
నాగబాబు, గెటప్ శీను, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన మేము కాప్‌లం వెబ్‌సిరీస్ శుక్రవారం జీ5 ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ ఓటీటీ ఫ్యాన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
Entertainment | Published On May 22, 2026, 8.48 pm IST
Web Series Review | మెగా బ్రదర్ నాగబాబు ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ వెబ్‌సిరీస్ మేము కాప్‌లం శుక్రవారం జీ5 ఓటీటీలో రిలీజైంది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో గెటప్ శీను, రవితేజ ముఖ్య పాత్రల్లో నటించారు. రైటర్ బీవీఎస్ రవి ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ తెలుగు వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
కోడి మిస్సింగ్...
మహదేవపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా రవి సొటారి (రవితేజ), కానిస్టేబుల్‌గా మోహన్ సొటారి (గెటప్ శీను) పనిచేస్తుంటారు. రవి అమాయకత్వం, అతి తెలివి కారణంగా ఊరిలో చిన్న పిల్లలు కూడా అతడికి విలువ ఇవ్వరు. ఊరి పెద్ద గజపతిరాజుకు (నాగబాబు) చెందిన పందెం కోడి సలార్ రాజు వరుసగా కొన్నేళ్లుగా సంక్రాంతి పందాల్లో గెలుస్తుంటుంది. ఓ ఏడాది కోడి పందాలకు కొద్ది రోజుల ముందు సలార్ రాజు కనిపించకుండాపోతుంది. ఆ కోడిని వెతికి గజపతిరాజుకు అప్పగించే బాధ్యత రవి, మోహన్‌లపై పడుతుంది. అసలు సలార్ రాజు ఎలా మిస్సయ్యింది? ఆ పందెం కోడిని మిస్సింగ్‌కు ఎస్ఐ రవికి ఉన్న సంబంధం ఏమిటి? గజపతిరాజు కూతురు సంఘవి ప్రేమించిన ఆకాష్‌రెడ్డి ఎవరు? సంక్రాంతి కోడి పందాలను అడ్డం పెట్టుకొని గంజాయి దందా నడపాలని ప్లాన్ చేసిన కొందరు క్రిమినల్స్‌ను రవి, మోహన్ ఎలా పట్టుకున్నారు. ఈ కేసుతో రిపోర్టర్ మీనాక్షికి (రీతూ చౌదరి) ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే ఈ సిరీస్ కథ.
కోనసీమ నేపథ్యంలో...
సంక్రాంతి పండుగ, కోనసీమ అంటే కోడి పందాలే గుర్తొస్తాయి. ఈ కోడి పందాల బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ కామెడీతో దర్శకుడు ప్రదీప్ మద్దాలి మేము కాప్‌లం వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ వెబ్‌సిరీస్ కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ డిఫరెంట్‌గా ఉంది. పందెం కోడి మిస్సవ్వడం, దానిని వెతికిపట్టుకునే క్రమంలో ఇద్దరు పోలీసులు ఆ ఊరిని పెద్ద ఆపద నుంచి ఎలా కాపాడారు అన్నదే ఈ సిరీస్ కథ.
సింపుల్ పాయింట్‌గా ఆద్యంతం ఎంటర్‌టైనర్‌గా చెప్పడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. కోడి దొంగను పట్టుకునేందుకు రవి, మోహన్ సాగించే ఇన్వేస్టిగేషన్ నుంచి చక్కటి ఫన్ జనరేట్ అయ్యింది. మరోవైపు ఊరిలో చేతబడుల క్షుద్రపూజలు జరుగుతున్నాయంటూ కామెడీ, సస్పెన్స్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కథను ముందుకు నడిపించారు. పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే కొందరి అక్రమ దందాలకు రవి, మోహన్ తమ తెలివితేటలతో ఎలా చెక్ పెట్టారన్నది కామెడీగానే చూపించి సిరీస్‌ను ఎండ్ చేశారు. ఇద్దరి క్యారెక్టర్లకు సరైన జస్టిఫికేషన్ ఇస్తూ సిరీస్‌ను ఎండ్ చేశారు.
ఆరు ఎపిసోడ్స్...
మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో మేము కాప్‌లం వెబ్‌సిరీస్ రూపొందింది. ఒక్కో ఎపిసోడ్ నిడివి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల మధ్య ఉంది. కాన్సెప్ట్ బాగున్నా కామెడీ విషయంలో దర్శకుడు తబడిపోయాడు. రవి, మోహన్ ఇన్వేస్టిగేషన్ సీన్లు ఓ స్టేజ్ వరకు నవ్విస్తాయి. ఆ తర్వాత సాగదీస్తూ వెళ్లిపోయినట్లుగా అనిపిస్తుంది. ఊరికి ఎదురయ్యే ఆపదలో థ్రిల్ మోతాదు పాళ్లు తగ్గాయి.
కామెడీ టైమింగ్...పంచ్‌లు...
పోలీస్ పాత్రల్లో రవితేజ, గెటప్ శీను తమ కామెడీ టైమింగ్, పంచ్‌లతో అదరగొట్టారు.. ప్రతి ఫ్లాన్ ఫెయిలై చివరకు వారే చిక్కుల్లో పడే సీన్లు నవ్విస్తాయి. గజపతిరాజుగా నాగబాబు క్యారెక్టర్‌లో పెద్దరికం బాగానే ఎలివేట్ అయ్యింది.
రీతూ చౌదరి విలనిజం మాత్రం తేలిపోయింది. కిరిటీ దామరాజు, చరణ్ లక్కరాజు, సిరి పార్వతితో పాటు మిగిలిన వారి నటన ఓకే. రైటర్ బీవీఎస్ రవి ఈ సిరీస్‌ను నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా ప్రదీప్ మద్దాలి టేకింగ్ బాగుంది. తాను అనుకున్న కథను ఎక్కడ డీవీయేట్ కాకుండా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు.
మేము కాప్‌లం సిరీస్‌లో క్రైమ్ తక్కువ. కామెడీ ఎక్కువ. మైండ్‌ను హీటెక్కించే ట్విస్ట్‌లు, టర్న్‌లు లేకుండా సరదాగా సాగిపోతుంది.
రేటింగ్ 3/ 5
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vishnu Priya | నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు – యూట్యూబర్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విష్ణుప్రియ
మే 22, 2026

Satyadev | సమవర్తిగా సత్యదేవ్ – టాలీవుడ్‌కు కొత్త జానర్‌ను పరిచయం చేస్తోన్న హీరో
మే 22, 2026

Nivetha Pethuraj | వెంకటేష్ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ – మరోసారి ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్?
మే 22, 2026
తాజావార్తలు
- ●OTT Releases This Week | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన మలయాళ, తమిళ సినిమాలు ఇవే
- ●Minister Sridhar Babu | డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లో రోల్‌మాడల్‌గా తెలంగాణ : మంత్రి శ్రీధర్‌బాబు
- ●Vishnu Priya | నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు - యూట్యూబర్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విష్ణుప్రియ
- ●Komati Reddy | ప్రభుత్వ స్కూల్ టాపర్లకు మంత్రి కోమటిరెడ్డి సర్ప్రైజ్ గిఫ్ట్.. విమానంలో వైజాగ్ టూర్..!
- ●Venkateshwar Reddy, Narendar Reddy | హరీశ్‌రావు ఉన్నమాటే అన్నారు.. అవాకులు, చెవాకులెందుకు యెన్నం: మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి
- ●Satyadev | సమవర్తిగా సత్యదేవ్ - టాలీవుడ్‌కు కొత్త జానర్‌ను పరిచయం చేస్తోన్న హీరో

OTT Releases This Week | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన మలయాళ, తమిళ సినిమాలు ఇవే

Minister Sridhar Babu | డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లో రోల్‌మాడల్‌గా తెలంగాణ : మంత్రి శ్రీధర్‌బాబు

Vishnu Priya | నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు - యూట్యూబర్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విష్ణుప్రియ

Komati Reddy | ప్రభుత్వ స్కూల్ టాపర్లకు మంత్రి కోమటిరెడ్డి సర్ప్రైజ్ గిఫ్ట్.. విమానంలో వైజాగ్ టూర్..!



