త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venkateshwar Reddy, Narendar Reddy | హ‌రీశ్‌రావు ఉన్న‌మాటే అన్నారు.. అవాకులు, చెవాకులెందుకు యెన్నం: మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి

Venkateshwar Reddy, Narendar Reddy | ఫ్యూచ‌ర్‌ సిటీపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఉన్న‌మాటే అన్నార‌ని, దానిపై యెన్నం శ్రీనివాస్ రెడ్డి అవాకులు, చెవాకులు పేలడం దేనిక‌ని మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On May 22, 2026, 6.10 pm IST

Venkateshwar Reddy, Narendar Reddy | హ‌రీశ్‌రావు ఉన్న‌మాటే అన్నారు.. అవాకులు, చెవాకులెందుకు యెన్నం: మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి
Advertisement

Venkateshwar Reddy, Narendar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఫ్యూచ‌ర్‌సిటీపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఉన్న‌మాటే అన్నార‌ని, దానిపై యెన్నం శ్రీనివాస్ రెడ్డి అవాకులు, చెవాకులు పేలడం దేనిక‌ని మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, అందుకే రద్దు చేస్తామని హరీష్ రావు అన్నార‌ని చెప్పారు. శుక్ర‌వారం వారు తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ లేని సిటీ అని.. అస‌లు కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచరే లేద‌ని ఎద్దేవా చేశారు. అది ఫ్యూచర్ సిటీ కాదని రేవంత్ రెడ్డి ఫోర్ బ్రదర్స్ సిటీ అని విమ‌ర్శించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను ఉరికించి కొడ‌తారు..

అమెరికాలో హరీష్ రావు మాట్లాడిన మాటలపై యెన్నం శ్రీనివాస్ రెడ్డి అవాకులు, చెవాకులు పేలుతున్నారు. 13 వేల 500 ఎకరాలు సేకరించామని హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 13 వేల 500 ఎకరాలను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని రాజకీయం చేస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడి చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. హైదరాబాద్ నగరంలో, జిల్లాల్లో ఉన్న ఫార్మా కంపెనీలన్నీ ఒకే చోట ఉండాలని కేసీఆర్ భూములు సేకరించారు. హరీష్ రావు మాట్లాడితే సీఎల్పీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రైతుల వద్దకు వెళ్తే ఉరికించి కొట్టే పరిస్థితి ఉంది అని వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి అన్నారు.

వంద శాతం ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేస్తాం..

ఎన్ని ఇసుక లారీలు వెళ్తున్నాయో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలుసు. కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు భాదపడుతున్నారు. 1.8 శాతంతోనే బీఆర్ఎస్ ఓడిపోయింది. మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు. సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీని వంద శాతం రద్దు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేక రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫ్యూచర్ సిటీ వైపు రావడం లేదు. ఫ్యూచర్ పిటీ కాకుండా ఉండాలనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అంటున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రావడం లేదు. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు ఎందుకు తగ్గాయి? అని మాజీ ఎమ్మెల్యే ప్ర‌శ్నించారు.

సీఎంకు 20 నుంచి 30 శాతం క‌మీష‌న్లు.

అనంత‌రం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. హరీష్ రావుపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. హరీష్ రావు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ఉన్న మాటే చెప్పారు. అధికారంలోకి రాగానే ఫార్మా సిటీని రద్దు చేసి రైతులకు భూములు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం కుటుంబ సభ్యులు, మంత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీకి ఎన్ని కంపెనీలు వచ్చాయో రేవంత్ రెడ్డి చెప్పాలి. పర్మిషన్లు ఇవ్వాలంటే సీఎంకు 20 నుంచి 30 శాతం కమీషన్లు ఇవ్వాలి అని న‌రేంద‌ర్‌రెడ్డి ఆరోపించారు.

దావోస్ పర్యటనలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో రేవంత్ రెడ్డి చెప్పాలి. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు నాతో కొడంగల్ కు రావాలి. రైతులతో మాట్లాడుదాం. కాంగ్రెస్ వాళ్ల‌ను రైతులు బట్టలు విప్పి కొడతారు. కాంగ్రెస్ నేతలు డైవర్షన్ కోసం చిల్లర మాటలు మాట్లాడుతున్నారు అని మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం మండిప‌డ్డారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement