త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komati Reddy | ప్రభుత్వ స్కూల్ టాపర్లకు మంత్రి కోమటిరెడ్డి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌.. విమానంలో వైజాగ్ టూర్‌..!

Komati Reddy | ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టించారు. గతంలో తిప్పర్తి మండల పర్యటన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో మాట్లాడిన మంత్రి.. టాప్ మార్కులు సాధించిన వారికి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు.

P

Telangana | Published On May 22, 2026, 6.35 pm IST

Komati Reddy | ప్రభుత్వ స్కూల్ టాపర్లకు మంత్రి కోమటిరెడ్డి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌.. విమానంలో వైజాగ్ టూర్‌..!
Advertisement

Komati Reddy | ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టించారు. గతంలో తిప్పర్తి మండల పర్యటన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో మాట్లాడిన మంత్రి.. టాప్ మార్కులు సాధించిన వారికి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో విద్యార్థులను సన్మానించి బహుమతులు అందజేశారు. తిప్పర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 14 మంది టాపర్ విద్యార్థులతో మంత్రి గంటన్నర పాటు ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి భవిష్యత్ లక్ష్యాలు, ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలపై చర్చిస్తూ చదువులో మరింత ముందుకు సాగాలని ప్రోత్సహించారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదని, ఉన్నత చదువుల కోసం తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

విద్యార్థులకు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌లో భాగంగా విశాఖపట్నం–అరకు వ్యాలీ ట్రిప్‌ను మంత్రి ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విమాన ప్రయాణానికి సంబంధించిన టికెట్లను అందజేశారు. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విద్యార్థుల బృందం విశాఖపట్నంకు బయలుదేరనుంది. అక్కడ త్రీ స్టార్ హోటల్‌లో బస ఏర్పాట్లు చేయడంతో పాటు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉపాధ్యాయుడు, వ్యక్తిగత సిబ్బందిని కూడా వెంట పంపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువుతోనే మనిషికి విలువ వస్తుందని, పేదరికాన్ని దూరం చేయాలంటే విద్యే ప్రధాన మార్గమని అన్నారు. విద్యార్థుల ఆలోచనలు కేవలం ఉద్యోగాల వరకే పరిమితం కాకుండా.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. స్టార్టప్ కంపెనీలు స్థాపించి విజయాలు సాధించిన వారి ఉదాహరణలు వివరిస్తూ, అలాంటి యువతకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. విద్య కోసం రూ.22 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వంటి విద్యాసంస్థలు భవిష్యత్తులో పేద విద్యార్థులకు భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇక విమాన ప్రయాణం గురించి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. “ఇప్పటివరకు ఆకాశంలో విమానం చూస్తూ ఎప్పుడెప్పుడు ఎక్కుతామా అనుకునేవాళ్లం. ఇప్పుడు మంత్రి సర్ ఇచ్చిన ఈ గిఫ్ట్ మా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం” అని పేర్కొన్నారు.

టాప్ మార్కులు సాధించిన విద్యార్థులు వీరే..

జెడ్పీహెచ్‌ఎస్ తిప్పర్తి

బుర్రి శ్రీనిధి – 579/600
సింగం స్రవంతి – 544

కేజీబీవీ
జే వర్షిత – 568
ఎస్ మధుశ్రీ – 556
పీ ప్రణీత – 543
టీ వైశాలి – 543
ఎం నందిని – 541

పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్

వై శ్రీజ – 565
వీ చరణ్ – 556
ఎం మానస – 558
ఎన్ రంజిత – 555

టీజీఎంఎస్ (మోడల్ స్కూల్)

శ్రావ్య – 539

Advertisement

తాజావార్తలు

Advertisement