త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి

Brahmotsavam 2026 | వెన్నెల వెలుగులు విరజిమ్మే చంద్రప్రభ వాహనం.. మురళీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి.. వర్షంలోనూ భక్తుల జయజయధ్వానాలు.. తిరుమలలో సోమవారం రాత్రి ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

P

Devotional | Published On Sep 21, 2026, 8.49 pm IST

Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి
Advertisement

Brahmotsavam 2026 | వెన్నెల వెలుగులు విరజిమ్మే చంద్రప్రభ వాహనం.. మురళీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి.. వర్షంలోనూ భక్తుల జయజయధ్వానాలు.. తిరుమలలో సోమవారం రాత్రి ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ సమయంలో వర్షం కురిసినా ఉత్సవం వైభవంగా కొనసాగింది. వర్షం నుంచి స్వామివారిని కాపాడేందుకు ఘటాటోపం ఏర్పాటు చేసి వాహనసేవ నిర్వహించారు. మురళీకృష్ణుడి రూపంలో కొలువుదీరిన మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సకల తాపహరం చంద్రప్రభ వాహనం

చంద్రుడు శివుడికి శిరోభూషణంగా ఉండగా.. శ్రీహరికి వాహనంగా సేవలందించడం చంద్రప్రభ వాహన విశిష్టతగా చెబుతారు. ఈ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో స్వామివారి దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వాహనసేవలో తిరుమల పెద్ద జీయ్యర్‌స్వామి, చిన్న జీయ్యర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో మురళీకృష్ణ, పలువురు బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement