త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంత‌కీ ఏం చెప్పిందో తెలుసా.?

TGPSC | తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక స్పష్టత ఇచ్చింది. పరీక్షల సిలబస్‌ను మార్చనున్నారంటూ కొంతకాలంగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరదించింది. ప్రస్తుతం సిలబస్‌ సమీక్ష కోసం ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదని కమిషన్‌ కార్యదర్శి వెల్లడించారు.

P

Telangana | Published On Sep 21, 2026, 9.30 pm IST

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంత‌కీ ఏం చెప్పిందో తెలుసా.?
Advertisement

TGPSC | తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక స్పష్టత ఇచ్చింది. పరీక్షల సిలబస్‌ను మార్చనున్నారంటూ కొంతకాలంగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరదించింది. ప్రస్తుతం సిలబస్‌ సమీక్ష కోసం ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదని కమిషన్‌ కార్యదర్శి వెల్లడించారు. సిలబస్‌ మార్పుపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుండటంతో పాటు కమిషన్‌కు వరుసగా వినతులు అందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. భవిష్యత్తులో సిలబస్‌లో పెద్దఎత్తున మార్పులు చేయాల్సి వస్తే.. అభ్యర్థులకు కనీసం ఏడాది ముందుగానే సమాచారం అందిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. దీంతో కొత్త విధానానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ చేసుకునేందుకు తగినంత సమయం ఉంటుందని తెలిపింది.

చిన్న మార్పులుంటే నోటిఫికేషన్‌లోనే..

సిలబస్‌లో స్వల్ప మార్పులు, అదనపు అంశాల చేర్పు వంటి నిర్ణయాలు తీసుకుంటే.. వాటిని సంబంధిత ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌లోనే స్పష్టంగా పేర్కొంటామని కమిషన్‌ తెలిపింది. ప్రస్తుతం సిలబస్‌ మార్పులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. అభ్యర్థులు సోషల్‌ మీడియాలో వచ్చే నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మి ఆందోళన చెందవద్దని టీజీపీఎస్సీ సూచించింది. కమిషన్‌ తాజా స్పష్టతతో ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు ఊరట ల‌భించిన‌ట్ల‌య్యింది.

Advertisement
Advertisement