Traffic Restrictions | నేడు భారత్-వెస్టిండీస్ మ్యాచ్.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
Traffic Restrictions | ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (Uppal Stadium) భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
Traffic Restrictions | త్రినేత్ర న్యూస్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (Uppal Stadium) భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. అదేవిధంగా భారీ వాహనాలను దారి మళ్లించనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
- ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు.. హెచ్ఎండీఏ ఉప్పల్ భగాయత్ ప్రవేశ ద్వారం, మెహ్ఫిల్ హోటల్ సమీపంలోని మళ్లింపు పాయింట్ వద్ద నుంచి నాగోల్, ఎల్బీ నగర్ వైపు వెళ్లాలి.
- ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు.. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకుని.. హెచ్ఎండీఏ భగాయత్, టయోటా యూటర్న్, బోడుప్పల్, చెంగిచెర్ల మీదుగా ఐఓసీఎల్ చెర్లపల్లి లేదా ఘట్కేసర్ వైపు వెళ్లాలి.
- తార్నాక నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు.. హబ్సిగూడ ఎక్స్ రోడ్ వద్ద మళ్లింపుతో నాచారం, ఎన్ఎఫ్సీ రోటరీ, ఐఓసీఎల్ చెర్లపల్లి మీదుగా వెళ్లాలి.
- రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు.. స్ట్రీట్ నంబర్ 8 వద్ద నుంచి హబ్సిగూడ ఎక్స్ రోడ్, నాచారం, ఎన్ఎఫ్సీ రోటరీ మీదుగా చెర్లపల్లి, ఘట్కేసర్ వైపు దారి మళ్లిస్తారు.
- వరంగల్ నుంచి ఉప్పల్ మీదుగా హైదరాబాద్ వచ్చే భారీ వాహనాలు.. ఘట్కేసర్ వద్ద ఓఆర్ఆర్ మార్గంలో మళ్లింపుతో అబ్దుల్లాపూర్‌మెట్, ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్ వైపు వెళ్లాలి.
- హైదరాబాద్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వెళ్లే భారీ వాహనాలు.. ఎల్బీ నగర్, హయత్‌నగర్ మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఓఆర్ఆర్ ఎక్కాల్సి ఉంటుంది.
వాహనాల పార్కింగ్..
ఇక మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకుల వాహనాల కోసం సుమారు 8 వేల వాహనాలకు పార్కింగ్ స్థలాలను గుర్తించారు. వీటిలో 4,600 ఫోర్ వీల్ వెహికల్స్.. 3,400 బైక్‌లకు పార్కింగ్ స్థలం కేటాయించారు. ఎల్జీ గోడౌన్, ఈకే మినార్ చెక్‌పోస్టుల ద్వారా స్టేడియం లోపలికి వీఐపీలు, వీవీఐపీలు, అనుమతి పాస్‌లు ఉన్న వాహనాలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.
ఇతర ప్రేక్షకుల కోసం ఉప్పల్-రామంతాపూర్ రోడ్డులోని జైన్ ప్రాపర్టీస్, మోడరన్ బేకరీ, అగర్వాల్ ప్రాపర్టీస్ ప్రాంతాలతో పాటు ఉప్పల్-హబ్సిగూడ రోడ్డులోని టీజీ ఐఏఎల్ఏ వద్ద పార్కింగ్ సదుపాయాలను గుర్తించారు. ఎన్జీఆర్ఐ మెట్రో, స్టేడియం మెట్రో స్టేషన్ల సమీపంలోనూ ఇతర పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు.
అర్ధరాత్రి వరకు ఆర్టీసీ, మెట్రో సర్వీసులు
మ్యాచ్ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు 60 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇవి సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు బస్సులు నడువనున్నాయి. బస్సుల వివరాల కోసం 99592 26160 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
అదేవిధంగా హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) కూడా అర్ధరాత్రి వరకు సర్వీసులు నిర్వహిస్తున్నది. రాత్రి 12 గంటలకు స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి చివరి రైలు బయలుదేరనుందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు స్టేడియం, ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్ల నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు.
TRAFFIC ADVISORY | INDIA vs WEST INDIES T20I
In view of the 4th T20 International between India and West Indies on 14 October 2026 at RGIC Stadium, Uppal, traffic diversions for heavy vehicles will be in force, with moderate congestion expected from 12:00 hrs to 23:50 hrs.
Commuters are advised to avoid affected routes, follow alternative routes, use RTC buses and Metro Rail, and plan their journeys accordingly.Malkajgiri Traffic Police requests your cooperation for smooth traffic management.
#TrafficAdvisory #MalkajgiriPolice #INDvsWI #SumathiIPS #TelanganaPolice
— Malkajgiri Police (@MalkajgiriCop) October 13, 2026
సంబంధిత వార్తలు

Uppal Stadium | 14న ఉప్పల్ స్టేడియంల్ క్రికెట్ మ్యాచ్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
అక్టోబర్ 13, 2026

RTC Metro Common Pass | ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై పునఃపరిశీలన.. ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్
అక్టోబర్ 12, 2026

TGSRTC | రద్దీగా మారిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
అక్టోబర్ 10, 2026
తాజావార్తలు
- ●Navaratri Brahmotsavam Special | 157 దేశాల కరెన్సీతో వెంకన్న హుండీ కళకళ!
- ●Boat Capsizes | గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతి
- ●Cabinet Secretariat | క్యాబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
- ●Horoscope | అక్టోబర్ 14 బుధవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
- ●CP VC Sajjanar | సైబర్ వలలో చిక్కొద్దు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు
- ●V Srinivas Goud | రైతులను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

Navaratri Brahmotsavam Special | 157 దేశాల కరెన్సీతో వెంకన్న హుండీ కళకళ!

Boat Capsizes | గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతి

Cabinet Secretariat | క్యాబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

Horoscope | అక్టోబర్ 14 బుధవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?



