TGSRTC | i-ALERT సాంకేతికతతో టీజీఎస్ ఆర్టీసీ సరికొత్త రికార్డు
TGSRTC | ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజా రవాణా వ్యవస్థలో వినియోగించడంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC ) దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. బీఎస్-6 బస్సుల్లో i-ALERT సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంధన పొదుపుతో పాటు సురక్షిత ప్రయాణానికి పెద్దపీట వేస్తోంది.
ఇప్పటివరకు రూ.36 కోట్ల డీజిల్ ఆదా.. నెలకు మరో రూ.2 కోట్ల పొదుపు
TGSRTC | త్రినేత్ర న్యూస్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజా రవాణా వ్యవస్థలో వినియోగించడంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC ) దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. బీఎస్-6 బస్సుల్లో i-ALERT సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంధన పొదుపుతో పాటు సురక్షిత ప్రయాణానికి పెద్దపీట వేస్తోంది. ఈ సాంకేతికతను అమలు చేసిన దేశంలోని తొలి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా టీజీఎస్ ఆర్టీసీ నిలిచింది.
ఈ వ్యవస్థ సమర్థవంతమైన వినియోగం ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.36 కోట్ల విలువైన హైస్పీడ్ డీజిల్ (HSD) ఆదా చేసినట్లు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ప్రతి నెలా సుమారు రూ.2 కోట్ల విలువైన డీజిల్ పొదుపు అవుతోందని తెలిపింది. ఖచ్చితమైన నెలవారీ పొదుపు రూ.2,00,00,156.85గా పేర్కొంది. దీంతో నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు బస్సుల ఇంధన సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతోంది.
డ్రైవర్ల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ
i-ALERT వ్యవస్థ డ్రైవర్ల డ్రైవింగ్ విధానాలను నిరంతరం పర్యవేక్షిస్తూ వారి పనితీరును అంచనా వేస్తుంది. సరైన గేర్ ఎంపిక, గ్రీన్ బ్యాండ్ ఆర్పీఎం పరిధిలో డ్రైవింగ్, ఎకానమీ గేర్ల వినియోగం, ఇంజిన్‌ను అనవసరంగా ఆన్‌లో ఉంచకుండా చూడటం వంటి అంశాలను విశ్లేషిస్తుంది. అలాగే అతివేగం, నిర్లక్ష్యంగా బ్రేకులు వినియోగించడం వంటి అంశాలను గుర్తిస్తుంది. ఇంధన పొదుపు డ్రైవింగ్ పద్ధతులను ప్రోత్సహించేందుకు డ్రైవర్లకు ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తుంది. విధి నిర్వహణ అనంతరం వారి పనితీరును అంచనా వేసి గ్రేడింగ్ కూడా ఇస్తుంది. ఈ నివేదికల ఆధారంగా డ్రైవర్లకు మార్గదర్శకత్వం కల్పిస్తూ డ్రైవింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుస్తోంది.

ఏటా 6,169 మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాల తగ్గింపు
టీజీఎస్ ఆర్టీసీకి చెందిన 1,500 అశోక్ లేలాండ్ బీఎస్-6 బస్సుల్లో i-ALERT పరికరాలను అమర్చారు. వీటి ద్వారా రోజుకు 6,603 లీటర్లు, నెలకు 1,98,090 లీటర్ల డీజిల్ ఆదా అవుతోంది. ఒక్కో లీటరు డీజిల్‌కు సుమారు 2.56 కిలోల కార్బన్ ఉద్గారాలు వెలువడతాయన్న అంచనా ప్రకారం.. ఈ సాంకేతికత ద్వారా రోజుకు 16.90 మెట్రిక్ టన్నులు, నెలకు 507.11 మెట్రిక్ టన్నులు, ఏడాదికి 6,169.84 మెట్రిక్ టన్నుల CO₂ ఉద్గారాలు తగ్గుతున్నాయి.
ఇంజనీరింగ్ విభాగానికి ఎండీ అభినందనలు
i-ALERT సాంకేతికతను విజయవంతంగా అమలు చేసిన టీజీఎస్ ఆర్టీసీ ఇంజనీరింగ్ విభాగాన్ని సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడమే సంస్థ లక్ష్యమని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇతర విభాగాలు కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సంస్థ సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు.
తాజావార్తలు
- ●CTI | బంగారం కొనొద్దన్న మోదీ.. మాకు మేలు చేసిదంటూ ప్రధానికి సీటీఐ లేఖ!
- ●Mahesh Kumar Goud | కేంద్ర విధానాల వల్ల తెలంగాణకు నష్టం
- ●Fingerprints | ఇద్దరు మనుషుల వేలిముద్రలు ఒకేలా ఉండవా? దీని వెనుక అసలు రహస్యం ఇదే!
- ●Mallu Ravi | రాజగోపాల్, అనిరుధ్‌లను కట్టడి చేస్తం.. ఈవినింగ్ మీటింగ్ తర్వాత ఏం జరిగిందనేది చెప్తా
- ●Goutham Prasad | అద్దంకి! రేవంత్ చెప్పులు మోయడానికే పనికొస్తవ్ నువ్
- ●Bandi Sanjay | బీజేపీని అడ్డుకునే దమ్ము ఆ పార్టీలకు లేదు.. రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే: బండి సంజయ్

CTI | బంగారం కొనొద్దన్న మోదీ.. మాకు మేలు చేసిదంటూ ప్రధానికి సీటీఐ లేఖ!

Mahesh Kumar Goud | కేంద్ర విధానాల వల్ల తెలంగాణకు నష్టం

Fingerprints | ఇద్దరు మనుషుల వేలిముద్రలు ఒకేలా ఉండవా? దీని వెనుక అసలు రహస్యం ఇదే!

Mallu Ravi | రాజగోపాల్, అనిరుధ్‌లను కట్టడి చేస్తం.. ఈవినింగ్ మీటింగ్ తర్వాత ఏం జరిగిందనేది చెప్తా



