Traffic Restrictions | సికింద్రాబాద్ మహంకాళి బోనాలు.. హైదరాబాద్‌లో మూడు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల( Ujjaini Mahankali Bonalu ) జాతర పండుగ నేపథ్యంలో నగరంలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల( Ujjaini Mahankali Bonalu ) జాతర పండుగ నేపథ్యంలో నగరంలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా.. ఆగస్టు 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. మహంకాళి అమ్మవారి ఆలయానికి 2 కిలోమీటర్ల రేడియస్‌లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఈ ప్రాంతాల్లోనే..
కార్బలా మైదాన్, రాణిగంజ్, ప్యారడైస్, సీటీవో, ప్లాజా, ఎస్బీఐ ఎక్స్ రోడ్, వైఎంసీఏ ఎక్స్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్ లేన్, బాటా, గాస్‌మండి ఎక్స్ రోడ్స్, బైబిల్ హౌజ్, మినిస్టర్స్ రోడ్, రసూల్‌పురా, ఓల్డ్ పీఎస్ రామ్‌గోపాల్‌పేట ఏరియాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నారు.
పలు రహదార్లు మూసివేత..
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆలయానికి వచ్చే రహదారులన్నింటినీ మూసివేయనున్నారు. కేవలం భక్తులకు మాత్రమే ఆ రహదారుల్లో అనుమతివ్వనున్నారు. కాబట్టి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు.
పార్కింగ్ ప్రాంతాలు ఇవే..
హరిహర కళాభవన్
ఓల్డ్ జైల్ ఖానా ఓపెన్ ప్లేస్
మహాత్మా గాంధీ స్టాచ్యూ, ఎంజీ రోడ్
స్వప్నలోక్ కాంప్లెక్స్
తాజ్ త్రీ స్టార్ లేన్
వెస్లీ కాలేజ్ పార్కింగ్
మహబూబ్ కాలేజ్
సీఎంఆర్ షాపింగ్ మాల్
నల్లగుట్ట జీహెచ్ఎంసీ గ్రౌండ్

తాజావార్తలు
- ●Surekha Vani | రెండో పెళ్లిపై సురేఖ వాణి రియాక్షన్ - ఆ ఆలోచన లేదంటూ కామెంట్స్
- ●Godavari River | ఉగ్ర గోదావరి.. భద్రాచలం వద్ద రెండో హెచ్చరిక జారీ..!
- ●E20 | 'నీట్' తరహాలోనే ఢిల్లీ వీధుల్లో మరో భారీ లొల్లి!
- ●Jupally Krishna Rao | తెలంగాణలో వైన్ తయారీ.. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అవకాశాలున్నాయి
- ●Cauvery Water Row | విజయ్ బెంగళూరు పర్యటన వాయిదా వేసుకోవాలి.. డీకే శివకుమార్ సూచన
- ●Rakul Preet Singh | ఇక్కడ సమంత ... అక్కడ రకుల్ - బాలీవుడ్‌లోకి మా ఇంటి బంగారం

Surekha Vani | రెండో పెళ్లిపై సురేఖ వాణి రియాక్షన్ - ఆ ఆలోచన లేదంటూ కామెంట్స్

Godavari River | ఉగ్ర గోదావరి.. భద్రాచలం వద్ద రెండో హెచ్చరిక జారీ..!

E20 | 'నీట్' తరహాలోనే ఢిల్లీ వీధుల్లో మరో భారీ లొల్లి!

Jupally Krishna Rao | తెలంగాణలో వైన్ తయారీ.. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అవకాశాలున్నాయి






