Rakul Preet Singh | ఇక్కడ సమంత … అక్కడ రకుల్ – బాలీవుడ్‌లోకి మా ఇంటి బంగారం
సమంత హీరోయిన్‌గా నటించిన మా ఇంటి బంగారం మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. తాజాగా మా ఇంటి బంగారం మూవీ బాలీవుడ్‌లోకి రీమేక్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రీమేక్‌లో హీరోయిన్ ఎవరంటే?
Entertainment | Published On Jul 31, 2026, 5.45 pm IST
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ కొత్త అడుగు వేయబోతుంది. ఇన్నాళ్లు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన ఈ బ్యూటీ ఇకపై తెర వెనుక నయా రోల్‌లో కనిపించబోతుంది. సినిమాల పరంగా ప్రస్తుతం బ్యాడ్‌ఫేజ్‌ను ఎదుర్కొంటోంది ఈ ఢిల్లీ బ్యూటీ. పరాజయాల కారణంగా టాలీవుడ్‌కు దూరమై చాలా ఏళ్లవుతోంది. బాలీవుడ్‌లో సెకండ్ హీరోయిన్ పాత్రలకు పరిమితమైంది. అవి కూడా రకుల్‌కు అంతగా అచ్చిరావడం లేదు.
నిర్మాతగా...
ఓ హిట్టు కోసం ఎదురుచూస్తోన్న రకుల్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. నిర్మాతగా మారబోతున్నట్లు తెలిసింది. తొలి ప్రయత్నంగా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని నిర్మించబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించబోతున్నదని అంటున్నారు.
మా ఇంటి బంగారం...
సమంత హీరోయిన్‌గా ఇటీవల రిలీజై వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన మా ఇంటి బంగారం రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలిసింది. ఈ రీమేక్‌తోనే తొలిసారి రకుల్ నిర్మాణ బాధ్యతలు చేపట్టబోతున్నదని అంటున్నారు. భర్త జాకీ భగ్నానీతో కలిసి ఈ రీమేక్‌ను ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. హిందీ వెర్షన్‌కు తగ్గట్లుగా కథలో చాలానే మార్పులు, చేర్పులు చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ రీమేక్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. కమ్ బ్యాక్ కోసమే రకుల్ ఈ రిస్క్ తీసుకుంటున్నట్లు చెబుతోన్నారు. ఈ ప్రయత్నమైన ఢిల్లీ బ్యూటీని గట్టెక్కిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగులో మా ఇంటి బంగారం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూనే ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మించింది. సమంత రూట్‌నే రకుల్ ఫాలో అవుతున్నట్లు సమాచారం.
రామాయణలో...
బాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ మూవీ రామాయణలో రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో కనిపించబోతుంది. గురువారం రిలీజ్ చేసిన ట్రైలర్‌లో రకుల్ పాత్ర హైలైట్‌గా నిలిచింది. రణభీర్ కపూర్, సాయిపల్లవి...సీతారాముడి పాత్రల్లో కనిపిస్తోన్న ఈ మూవీ ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Taslima Nasrin | 19 ఏళ్ల తర్వాత.. కోల్‌కతాలో అడుగుపెట్టిన తస్లీమా
- ●HMWSSB | వాన నీటిని ఒడిసిపట్టడమే హైదరాబాద్‌కు శాశ్వత నీటి భద్రత
- ●Indiramma Tower | ఆగస్టు చివరి వారంలో ఇందిరమ్మ టవర్స్ పనులు
- ●Huawei MatePad 11.5 2026 | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన హువావే మేట్ ప్యాడ్.. ధర ఎంతంటే..
- ●Singareni | థర్మల్ కేంద్రాలకు కొరత లేకుండా సరఫరా చేయాలి : సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్
- ●Parliament | ప్రతిపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన ఉభయసభలు

Taslima Nasrin | 19 ఏళ్ల తర్వాత.. కోల్‌కతాలో అడుగుపెట్టిన తస్లీమా

HMWSSB | వాన నీటిని ఒడిసిపట్టడమే హైదరాబాద్‌కు శాశ్వత నీటి భద్రత

Indiramma Tower | ఆగస్టు చివరి వారంలో ఇందిరమ్మ టవర్స్ పనులు

Huawei MatePad 11.5 2026 | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన హువావే మేట్ ప్యాడ్.. ధర ఎంతంటే..






