Godavari River | ఉగ్ర గోదావరి.. భద్రాచలం వద్ద రెండో హెచ్చరిక జారీ..!
Godavari River | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం శుక్రవారం మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 11,44,507 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వ
Godavari River | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం శుక్రవారం మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 11,44,507 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గోదావరిలో నీటిప్రవాహం గంటగంటకూ పెరుగుతుండటంతో తీర ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశారు.
భారీ వర్షాలతో తెలంగాణలోని పలు ప్రధాన ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. కడెం ప్రాజెక్టు నీటిమట్టం 698.02 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 10,282 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 70 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, నీటిమట్టం 1,069 అడుగుల వద్ద ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా వరద నీటితో నిండుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం 147.30 మీటర్లకు చేరుకుంది. ఎల్లంపల్లిలోకి 1,32,785 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి 18,445 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. నీటిమట్టాలు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిస్థితికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు.
తాజావార్తలు
- ●E20 | 'నీట్' తరహాలోనే ఢిల్లీ వీధుల్లో మరో భారీ లొల్లి!
- ●Jupally Krishna Rao | తెలంగాణలో వైన్ తయారీ.. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అవకాశాలున్నాయి
- ●Cauvery Water Row | విజయ్ బెంగళూరు పర్యటన వాయిదా వేసుకోవాలి.. డీకే శివకుమార్ సూచన
- ●Rakul Preet Singh | ఇక్కడ సమంత ... అక్కడ రకుల్ - బాలీవుడ్‌లోకి మా ఇంటి బంగారం
- ●Taslima Nasrin | 19 ఏళ్ల తర్వాత.. కోల్‌కతాలో అడుగుపెట్టిన తస్లీమా
- ●HMWSSB | వాన నీటిని ఒడిసిపట్టడమే హైదరాబాద్‌కు శాశ్వత నీటి భద్రత

E20 | 'నీట్' తరహాలోనే ఢిల్లీ వీధుల్లో మరో భారీ లొల్లి!

Jupally Krishna Rao | తెలంగాణలో వైన్ తయారీ.. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అవకాశాలున్నాయి

Cauvery Water Row | విజయ్ బెంగళూరు పర్యటన వాయిదా వేసుకోవాలి.. డీకే శివకుమార్ సూచన

Rakul Preet Singh | ఇక్కడ సమంత ... అక్కడ రకుల్ - బాలీవుడ్‌లోకి మా ఇంటి బంగారం





