Sanathnagar TIMS | సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు.. డైరెక్టర్‌గా నరేంద్ర కుమార్
Sanathnagar TIMS | హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్‌లో నిర్మించిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)కు మాజీ ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి పేరును ఖరారు చేశారు.
Sanathnagar TIMS | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్‌లో నిర్మించిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)కు మాజీ ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి పేరును ఖరారు చేశారు. ఇకపై టిమ్స్‌ను డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌గా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఆవిర్భావం, ప్రజాసేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో విశిష్ట సేవలు అందించిన మహానేత డా. మర్రి చెన్నారెడ్డికి ఇది రాష్ట్ర ప్రభుత్వం అందించిన సముచిత గౌరవం అని ప్రభుత్వం పేర్కొంది.
ఇంచార్జి డైరెక్టర్‌గా డాక్టర్ నరేంద్ర కుమార్

ఇక మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌కు ఇంచార్జి డైరెక్టర్‌గా డాక్టర్ ఎ నరేంద్ర కుమార్ నియమితులయ్యారు. 2026 ఆగస్టు 1వ తేదీ నుంచి టిమ్స్ ఇంచార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం వైద్య విద్యా సంచాలకుడిగా (Director of Medical Education) సేవలందిస్తున్న డా. నరేంద్ర కుమార్ జూలై 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణిస్తూ, టిమ్స్‌లో నాణ్యమైన వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తూ డా. ఎ. నరేంద్ర కుమార్‌కు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది.
తాజావార్తలు
- ●Lal Darwaza Bonalu | లాల్‌దర్వాజా ఆలయంలో శిఖర పూజ.. 24 గంటలు ప్రత్యేక నిఘా
- ●Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. వరుసగా మూడో రోజూ సూచీల జోరు..
- ●Jana Nayagan | కర్ణాటకలో జననాయగన్ స్క్రీనింగ్ నిలిపివేత - సీఎం దళపతి విజయ్ పోస్టర్లు చించేసిన ఆందోళనకారులు
- ●Teenmar Mallanna | మా మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి సైనికుడు.. ఇక కత్తెర గుర్తుతో చరిత్ర మారుస్తాం
- ●Vande Bharat | వందేభారత్‌లో తొలిసారి గుండె తరలింపు
- ●OpenAI | ఏఐ యూజర్లకు గుడ్ న్యూస్.. చాట్ జీపీటీలో వినియోగధరలు తగ్గింపు..

Lal Darwaza Bonalu | లాల్‌దర్వాజా ఆలయంలో శిఖర పూజ.. 24 గంటలు ప్రత్యేక నిఘా

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. వరుసగా మూడో రోజూ సూచీల జోరు..

Jana Nayagan | కర్ణాటకలో జననాయగన్ స్క్రీనింగ్ నిలిపివేత - సీఎం దళపతి విజయ్ పోస్టర్లు చించేసిన ఆందోళనకారులు

Teenmar Mallanna | మా మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి సైనికుడు.. ఇక కత్తెర గుర్తుతో చరిత్ర మారుస్తాం





