Hyderabad | డెలివరి విషయంలో స్నేహితుల మధ్య గొడవ.. యువకుడి దారుణ హత్య
Hyderabad | స్నేహితుల మధ్య మొదలైన చిన్న తగాదా దారుణ హత్యకు (Murder) దారితీసింది. డెలివరి విషయంలో గొడవ పడిన స్నేహితులు.. సహచరుడిని వెంటాడి చంపిన ఘటన హైదరాబాద్‌లోని (Hyderabad) నార్సింగిలో చోటుచేసుకుంది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: స్నేహితుల మధ్య మొదలైన చిన్న తగాదా దారుణ హత్యకు (Murder) దారితీసింది. డెలివరి విషయంలో గొడవ పడిన స్నేహితులు.. సహచరుడిని వెంటాడి చంపిన ఘటన హైదరాబాద్‌లోని (Hyderabad) నార్సింగిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఓ డెలివరి (Delivery) విషయంలో స్నేహితుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా ఘర్షణకు దారితీయడంతో.. అబ్దుల్ సమీద్ అనే యువకుడిని అతడి సహచర స్నేహితులే వెంటాడి దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్లతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. హత్యకు గల అసలు కారణం ఏమిటి?, వారి మధ్య గతంలో ఏమైనా వివాదాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత విభేదాలు, పాత గొడవలు లేదా ఇతర కారణాలు ఈ హత్యకు దారితీశాయా అనే అంశాలను ఆరాతీస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Tunnel Collapse | ఉత్తరాఖండ్లో సొరంగ ప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం
- ●Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత

Tunnel Collapse | ఉత్తరాఖండ్లో సొరంగ ప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం

Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి






