Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఉదయం 6 నుంచే హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సోమవారం చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చేప ప్రసాదం కోసం జనాలు భారీగా తరలివచ్చారు.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సోమవారం చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చేప ప్రసాదం కోసం జనాలు భారీగా తరలివచ్చారు. రేపు ఉదయానికి తండోపతండాలుగా జనాలు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, గాంధీ భవన్, టీజీపీఎస్సీ కార్యాలయంతో పాటు సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు.
బస్సులు, వ్యాన్లలో వచ్చే వారు గాంధీభవన్, గృహకల్ప బస్టాప్‌ల నుంచి రావాలని సూచించారు. ఆటోల్లో వచ్చే వారికి షెజాన్ హోటల్ వద్ద ప్రత్యేక అలైటింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
124 ఆర్టీసీ బస్సులు సిద్ధం
చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు 124 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bachupally Flyover | రేపు బాచుపల్లి ఫ్లై ఓవర్ ప్రారంభం.. ఎన్‌హెచ్ 65పై ట్రాఫిక్ ఆంక్షలు
- ●Shreyas Iyer | టీ20 జట్టుకు సారథ్యం దక్కడం గర్వకారణం.. తొలిసారిగా స్పందించిన శ్రేయాస్ అయ్యర్
- ●Nag Ashwin | ప్రీ రిలీజ్ ఈవెంట్లో కింద కూర్చున్న నాగ్ అశ్విన్ - కల్కి డైరెక్టర్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా
- ●IND Vs AFG Test | బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భారత్.. 564 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్.. ఆఫ్ఘన్ స్కోర్ 81/3
- ●Women Safety Wing | ప్రాంతాల్లో పర్యటిస్తూ.. మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తూ
- ●INDIA | ఇండియా కూటమిలో లుకలకలు.. కాంగ్రెస్‌పై సీపీఎం ఆగ్రహం, రేపటి భేటీని బహిష్కరించిన డీఎంకే

Bachupally Flyover | రేపు బాచుపల్లి ఫ్లై ఓవర్ ప్రారంభం.. ఎన్‌హెచ్ 65పై ట్రాఫిక్ ఆంక్షలు

Shreyas Iyer | టీ20 జట్టుకు సారథ్యం దక్కడం గర్వకారణం.. తొలిసారిగా స్పందించిన శ్రేయాస్ అయ్యర్

Nag Ashwin | ప్రీ రిలీజ్ ఈవెంట్లో కింద కూర్చున్న నాగ్ అశ్విన్ - కల్కి డైరెక్టర్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా

IND Vs AFG Test | బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భారత్.. 564 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్.. ఆఫ్ఘన్ స్కోర్ 81/3





