Traffic Restrictions | రాత్రి 8 వరకు.. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రయల్ వన్‌వే ట్రాఫిక్
Traffic Restrictions | హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ (KBR Park) పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న పనుల కారణంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రయల్ వన్‌వే ట్రాఫిక్ (One Way Traffic) విధానం అమలుచేస్తున్నారు.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్: హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ (KBR Park) పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న పనుల కారణంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రయల్ వన్‌వే ట్రాఫిక్ (One Way Traffic) విధానం అమలుచేస్తున్నారు. ఆదివారం ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల రహదారులన్నింటిలో వన్‌వే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణపై నగర సీపీ ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.
సీనియర్ ట్రాఫిక్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించనున్నారు. ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, వాహనాల సాఫీ రాకపోకలే లక్ష్యంగా దీనిని నిర్వహించనున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ మార్పులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. వన్‌వే విధానం అమలుపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ట్రయల్ ఫలితాల ఆధారంగా భవిష్యత్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ట్రాఫిక్ మార్పుల దృష్ట్యా వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సైన్‌బోర్డులను గమనిస్తూ, అవసరమైన చోట్ల లేన్ చేంజర్లను వినియోగించి ఎడమ, కుడి లేన్లలోకి మారాలని అధికారులు సూచించారు.
వన్‌వే ట్రాఫిక్ ఇలా..
- ఎన్‌ఎఫ్‌సీఎల్ వైపు నుంచి ఎస్‌ఎన్‌టీ, సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నం.36, రోడ్ నం.45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమవైపు తిరిగి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, ఒమేగా దవాఖాన, భారతీయ విద్యాభవన్ జంక్షన్ మీదుగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు.
- యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్, రోడ్ నెం.36, రోడ్ నం.45, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలకు రెండు ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులో ఉంచారు.
- ఇందిరానగర్ గడ్డ రోడ్, వెంకటగిరి జంక్షన్, డైమండ్ హౌస్, జూబ్లీహిల్స్ రోడ్ నం.10 మీదుగా ఒక మార్గం ఉండగా, అన్నపూర్ణ స్టూడియో బైలేన్, ఎన్టీఆర్ భవన్, బసవతారకం ఆస్పత్రి, భారతీయ విద్యాభవన్ మీదుగా మరో మార్గాన్ని సూచించారు.
- అలాగే ఐటీసీ కోహినూర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి, ఎన్టీఆర్ భవన్, పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలు రోడ్ నం.60, 67 మీదుగా ప్రయాణించి రోడ్ నం.1 ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
సంబంధిత వార్తలు

Traffic Restrictions | కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు.. వన్‌వే ట్రయల్ రన్
జూన్ 19, 2026

Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
జూన్ 18, 2026

Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..
జూన్ 9, 2026
తాజావార్తలు
- ●Thalapathy Vijay | దళపతి విజయ్, మహేష్‌బాబు కలిసి సినిమా చేయాల్సింది .. కానీ - తమిళ హీరో కామెంట్స్ వైరల్
- ●PM Modi | యోగా ట్రైనర్‌గా మారిన ప్రధాని మోదీ.. వీడియో
- ●FIFA 2026 | ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్ ట్రావెల్‌పై ఆంక్షలు.. నిరసనలున్నా వెనక్కి తగ్గని అమెరికా
- ●Ecuador vs Curaçao | ఎలోయ్ రూమ్ వీరోచిత పోరాటం.. ఫిఫాలో ఖాతా తెరిచిన కురకావో
- ●KTR | జయశంకర్ సార్ భౌతికంగా లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని: కేటీఆర్
- ●Bus Accident | ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి

Thalapathy Vijay | దళపతి విజయ్, మహేష్‌బాబు కలిసి సినిమా చేయాల్సింది .. కానీ - తమిళ హీరో కామెంట్స్ వైరల్

PM Modi | యోగా ట్రైనర్‌గా మారిన ప్రధాని మోదీ.. వీడియో

FIFA 2026 | ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్ ట్రావెల్‌పై ఆంక్షలు.. నిరసనలున్నా వెనక్కి తగ్గని అమెరికా

Ecuador vs Curaçao | ఎలోయ్ రూమ్ వీరోచిత పోరాటం.. ఫిఫాలో ఖాతా తెరిచిన కురకావో



