త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Devarakonda | ఓల్డ్ సిటీ బోనాల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. 2 వేల మందితో పోలీసు బందోబ‌స్తు

Vijay Devarakonda | ఓల్డ్ సిటీ బోనాల పండుగ‌కు సర్వం సిద్ధ‌మైంది. పాత బ‌స్తీలోని లాల్ ద‌ర్వాజ సింహ‌వాహిని మ‌హంకాళి ఆల‌యాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల‌తో ఆల‌యం వెలిగిపోతోంది. ఇక ఆదివారం తెల్ల‌వారుజాము నుంచే అమ్మ‌వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు బారులు తీరే అవ‌కాశం ఉంది.

S

Hyderabad | Published On Aug 8, 2026, 4.43 pm IST

Vijay Devarakonda | ఓల్డ్ సిటీ బోనాల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. 2 వేల మందితో పోలీసు బందోబ‌స్తు
Advertisement

Vijay Devarakonda | త్రినేత్ర‌.న్యూస్ : ఓల్డ్ సిటీ బోనాల పండుగ‌కు సర్వం సిద్ధ‌మైంది. పాత బ‌స్తీలోని లాల్ ద‌ర్వాజ సింహ‌వాహిని మ‌హంకాళి ఆల‌యాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల‌తో ఆల‌యం వెలిగిపోతోంది. ఇక ఆదివారం తెల్ల‌వారుజాము నుంచే అమ్మ‌వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు బారులు తీరే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో ఆల‌యం వ‌ద్ద‌, ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. బోనాల పండుగ సంద‌ర్భంగా 2 వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ట్లు పోలీసు ఉన్న‌తాధికారులు తెలిపారు.

లాల్ ద‌ర్వాజ సింహ‌వాహిని మ‌హంకాళి అమ్మ‌వారికి బోనాలు స‌మ‌ర్పించేందుకు వీఐపీలు, రాజ‌కీయ నాయ‌కులు, క్రీడా ప్ర‌ముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు త‌ర‌లిరానున్నారు. ముఖ్యంగా విజ‌య్ దేవ‌రకొండ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పించి, ద‌ర్శించుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ప‌టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న మంత్రి పొన్నం

ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు సింహ‌వాహిని మ‌హంకాళి అమ్మ‌వారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌తో క‌లిసి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, మొక్కులు చెల్లించుకోనున్నారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు

పాత‌బ‌స్తీలో బోనాల పండుగ సంద‌ర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఉంటాయ‌ని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప‌లు చోట్ల ర‌హ‌దారులు మూసివేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసుల‌కు వాహ‌న‌దారులు, ప్ర‌యాణికులు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement