త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs SL Test | శ్రీలంక టెస్టు సిరీస్‌కు సాయి సుదర్శన్ దూరం..

IND Vs SL Test | శ్రీలంకతో ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఎడమచేతి వాటం బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కినా.. ఫిట్‌నెస్‌ ఆధారంగానే ఎంపిక ఉంటుంద‌ని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది.

P

Sports | Published On Aug 8, 2026, 4.16 pm IST

IND Vs SL Test | శ్రీలంక టెస్టు సిరీస్‌కు సాయి సుదర్శన్ దూరం..
Advertisement

IND Vs SL Test | శ్రీలంకతో ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఎడమచేతి వాటం బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కినా.. ఫిట్‌నెస్‌ ఆధారంగానే ఎంపిక ఉంటుంద‌ని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. స‌కాలంలో గాయం నుంచి కోలుకోక‌పోవ‌డంతో సిరీస్‌కు దూరం కావాల్సి వ‌చ్చింది. ఇంత‌కు ముందు స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సైతం గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. అత‌ని స్థానంలో ఆకీబ్‌ నబీని జట్టులోకి తీసుకున్నారు. సుదర్శన్‌ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయాన్ని బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు.

మూడో స్థానంలో ప‌డిక్క‌ల్‌

సుదర్శన్‌ అందుబాటులో ఉంటే మూడో స్థానంలో అత‌నే బరిలోకి దిగే అవ‌కాశం ఉండేది. ప్ర‌స్తుతం ఆ స్థానానికి దేవ‌త్ ప‌డిక్క‌ల్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ది. శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న సన్నాహక మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ప‌డిక్క‌ల్ 121 బంతుల్లో 103 పరుగులు చేసి రిటైర్డ్‌ ఔటయ్యాడు. దీంతో టెస్టు తుది జట్టులో అతడికి చోటు దక్కే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఫిట్‌నెస్‌పై కూడా సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సన్నాహక మ్యాచ్‌లో గిల్‌ బ్యాటింగ్‌కు దిగలేదు. దీంతో ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. భారత్‌-శ్రీలంక తొలి టెస్టు గాలెలో జరగనుంది. ఈ వేదికపై ఇరు జట్లు ఇప్పటివరకు ఐదుసార్లు తలపడగా.. ఒక్క మ్యాచ్‌ కూడా డ్రాగా ముగియలేదు. భారత్‌ రెండుసార్లు గెలవగా, శ్రీలంక మూడుసార్లు విజయం సాధించింది. 2017 జులైలో గాలెలో చివరిసారి తలపడినప్పుడు భారత్‌ 304 పరుగుల భారీ తేడాతో గెలిచింది.

Advertisement
Advertisement